భజ్జీ సినిమా టీజర్‌ విడుదల, విషెస్‌ చెప్పిన రైనా

2 Mar, 2021 11:52 IST|Sakshi

‘ఫ్రెండ్‌షిప్’‌ టీజర్‌ విడుదల చేసిన భజ్జీ

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఆటగాడు‌ హర్బజన్‌ సింగ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఫ్రెండ్‌ షిప్’‌. ప్రస్తుతం ఈ సినిమా చివరి షూటింగ్‌ షెడ్యూల్‌ను జరుపుకుంటోంది. ఈ క్రమంలో భజ్జీ  తన మూవీ టీజర్‌ను ట్విటర్‌లో మంగళవారం విడుదల చేశాడు. హిందీ, తెలుగు, తమిళ బాషల్లో విడుదలైన ఈ టీజర్‌ యూట్యూబ్‌ లింక్‌లను షేర్‌ చేస్తూ.. ‘నా మూవీ ‘ఫ్రెండ్‌షిప్‌’ టీజర్‌ వచ్చేసింది. లింక్స్‌ ఇక్కడ ఉన్నాయి. చూసి ఎంజాయ్‌ చేయండి గాయ్స్‌’ అంటూ భజ్జీ ట్వీట్‌ చేశాడు. దీంతో క్రికెటర్‌ సురేష్‌ రైనా, మరికొందరు ఆటగాళ్లు, అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా భజ్జీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా ఇప్పటికే విడుదలైన ఈ మూవీలోని పాట, ఫస్ట్‌లుక్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తోంది.


ఇటీవల విడుదలైన ఓ సాంగ్‌లో భజ్జీ లుంగీతో మాస్‌ స్టేప్పులేసి అదరగొట్టాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్న హర్భజన్‌ అనంతరం ఐపీఎల్‌లో పాల్గోననున్నాడు. ఇదివరకు భజ్జీ బాలీవుడ్‌ చిత్రాలు ‘ముజే షాదీ కరోగీ’, ‘సెకండ్‌ హ్యాండ్‌ హస్బెండ్‌’తో పాటు ఓ పంజాబీ మూవీల్లో అతిథి పాత్రల్లో కనిపించిన సంగతి తెలిసిందే. జాన్‌ పాల్‌రాజ్‌, శ్యామ్‌ సూర్య నిర్మాణంలో రూపొందుతున్న ఈ మూవీలో యాక‌్షన్‌ కింగ్‌ అర్జున్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. 2019లో ప్రారంభమైన ఈ సినిమా కరోనా వలన ఆలస్యమైంది. ఇప్పుడు షూటింగ్‌ను శరవేగంగా పూర్తిచేసుకుంటూ వేసవిలో విడుదలకు సిద్ధంగా అవుతోంది.

చదవండి: తమిళ బంధాన్ని తలుచుకుని భావోద్వేగం
        భజ్జీ సినిమా హక్కులు ఎ.ఎన్‌.బాలాజీకీ

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు