హరికృష్ణన్, షీలా జంటగా కొత్త చిత్రం

7 Jul, 2022 15:20 IST|Sakshi

మెడ్రాస్‌ చిత్రం ఫేమ్‌ హరికృష్ణన్, టూలెట్‌ చిత్రం ఫేమ్‌ షీలా రాజ్‌కుమార్‌ జంటగా నటిస్తున్న తాజా చిత్రం బుధవారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. దర్శకుడు పా.రంజిత్‌ ముఖ్య అతిథిగా హాజరై చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మంజల్‌ సినిమా పతాకంపై గోల్డెన్‌ సురేష్, విజయలక్ష్మి కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా జస్టిన్‌ ప్రభు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

మధ్య తరగతి కుటుంబాల జీవితాల్లో జరిగే సంఘటనలను ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. సహజత్వానికి దగ్గరగా ఉంటుందన్నారు. చిత్ర షూటింగ్‌ను కృష్ణగిరి, పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించనున్నట్లు చెప్పారు. ఏ.కుమరన్‌ ఛాయాగ్రహణం, శివశంకర్‌ మాటలను అందిస్తున్నారని తెలిపారు. మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు చెప్పారు.

చదవండి: ఆ కామెడీ షో నుంచి అందుకే తప్పుకున్నా.. జబర్దస్త్‌ అప్పారావు
కృష్ణ వంశీ భారీ ప్లాన్‌.. రూ.300 కోట్లతో ఓటీటీ ప్రాజెక్ట్‌!

మరిన్ని వార్తలు