యూత్‌ఫుల్‌ ప్రేమకథ

30 Oct, 2023 01:53 IST|Sakshi
కిశోర్‌ కేఎస్‌డీ 

కిశోర్‌ కేఎస్‌డీ, దియా సితెపల్లి జంటగా నటిస్తున్న చిత్రం ‘ప్రేమకథ’. టాంగాప్రోడక్షన్స్ ఎల్‌ఎల్‌పీ, సినీ వ్యాలీ మూవీస్‌ పతాకాలపై విజయ్‌ మట్టపల్లి, సుశీల్‌ వాజపిల్లి, శింగనమల కల్యాణ్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను దర్శకుడు హరీష్‌ శంకర్‌ విడుదల చేసి, లుక్‌ బాగుందని, ఈ సినిమా విజయం సాధించాలని చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘వైవిధ్యమైన లవ్‌స్టోరీతో నేటితరం యువ ప్రేక్షకులకు నచ్చేలా ఈ చిత్రం ఉంటుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ చివరి దశలో ఉంది’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: రథన్ , సహనిర్మాత: ఉపేంద్ర గౌడ్‌ ఎర్ర.

మరిన్ని వార్తలు