‘లవ్‌ యూ రామ్‌’ టీజర్‌ను రిలీజ్‌ చేసిన హరీష్‌ శంకర్‌

10 Dec, 2022 10:21 IST|Sakshi

‘రోహిత్‌ నటించిన ‘నాట్యం’ చూశాను. అతనిలో మంచి డ్యాన్సర్, యాక్టర్‌ వున్నారు. ‘లవ్‌ యూ రామ్‌’ అతనికి మంచి బ్రేక్‌ ఇస్తుందని నమ్ముతున్నాను. ఈ సినిమాలో పాటలు అద్భుతంగా వున్నాయి. దర్శకుడిగా అద్భుత చిత్రాలు అందించిన దశరథ్‌ నిర్మాతగానూ సక్సెస్‌ అవ్వాలని కోరుతున్నాను’’ అన్నారు తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌. రోహిత్‌ బెహల్, అపర్ణ జనార్ధనన్‌ జంటగా దర్శకుడు కె. దశరథ్‌ అందించిన కథతో తెరకెక్కుతున్న చిత్రం ‘లవ్‌ యూ రామ్‌’.

డీవై చౌదరి దర్శకత్వంలో డీవై చౌదరి, కె. దశరథ్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా సాంగ్‌ టీజర్‌ని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్, టీజర్‌ను దర్శకుడు హరీష్‌ శంకర్‌ రిలీజ్‌ చేశారు. ‘‘ఈ సినిమా చూశాను. అందరూ ఆదరిస్తారని అనుకుంటున్నాను’’ అన్నారు హరీష్‌ శంకర్‌. ‘‘మిస్టర్‌ పర్ఫెక్ట్‌’తో హరీష్‌ శంకర్, నా జర్నీ మొదలైంది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఈ చిత్రానికి పని చేశారాయన’’ అన్నారు కె. దశరథ్‌. ‘‘ఈ సినిమాలో దశరథ్‌గారు కూడా నటించారు’’ అన్నారు డీవై చౌదరి. ఈ చిత్రానికి సంగీతం: కె. వేద.
 

మరిన్ని వార్తలు