Harry Potter Actor Died: ఆ సమస్యతో చనిపోయిన 'హ్యారీపోటర్' యాక్టర్!

28 Sep, 2023 19:21 IST|Sakshi

ఇప్పటి జనరేషన్‌కి పెద్దగా తెలియకపోవచ్చు కానీ 90ల్లో 'హ్యారీపోటర్' సినిమాలు ఓ ఊపు ఊపాయి. వందల కోట్ల కలెక్షన్స్ సొంతం చేసుకోవడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా విశేషాదరణ దక్కించుకున్నాయి. ఇందులో ప్రధాన పాత్రల్లో నటించిన యాక్టర్స్‌తోపాటు మిగతా వాళ్లు కూడా బోలెడంత క్రేజ్ తెచ్చుకున్నారు. అలా 'హ్యారీపోటర్'లో డంబెల్ డోర్ పాత్రతో గుర్తింపు తెచ్చుకున్న యాక్టర్ ఇప్పుడు తుదిశ్వాస విడిచారు.

(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' కోసం నాగార్జునకి అన్ని కోట్ల రెమ్యునరేషన్!?)

'హ్యారీపోటర్' డంబెల్‌డోర్‌గా ప్రసిద్ధి చెందిన నటుడి అసలు పేరు సర్ మైకేలే గాంబన్. ఐర్లాండ్ పుట్టిన ఈయన చిన్నతనంలోనే తల్లిదండ్రులతో కలిసి లండన్ వచ్చేశారు. కాస్త వయసొచ్చిన తర్వాత థియేటర్, టీవీ, సినిమాల్లో పలు పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇకపోతే 'హ్యారీపోటర్' తొలి రెండు భాగాల్లో డంబెల్‌డోర్ పాత్రధారి రిచర్డ్ హ్యారీస్ చనిపోవడంతో ఆ రోల్ చేసే ఛాన్స్ ఈయనకు వచ్చింది.

అలా దాదాపు 'హ్యారీపోటర్' ఫ్రాంచైజీలోని 6 సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ఈయన వయసు 82 ఏళ్లు. గత కొన్నాళ్లుగా న‍్యూమోనియోతో బాధపడుతున్న ఈయన.. ఆస్పత్రిలో కుటుంబసభ్యులు ముందే కన్నుమూశారు. ఇప్పుడు ఈ విషయం.. 'హ్యారీపోటర్' అభిమానుల్ని కంటతడి పెట్టిస్తోంది. 

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 37 సినిమాలు)

మరిన్ని వార్తలు