ఈ హీరో వర్జిన్‌, ఇతడికి పాపం, పుణ్యం తెలీదు: బాలయ్య

16 Apr, 2021 16:28 IST|Sakshi

హర్ష్‌ కనుమిల్లి, సిమ్రాన్‌ చౌదరి జోడీగా నటిస్తున్న చిత్రం 'సెహరి'. శుక్రవారం ఈ సినిమా టీజర్‌ రిలీజైంది. ఇందులో బాలయ్యను బాగా వాడుకున్నట్లు కనిపిస్తోంది. మూవీ ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేసినప్పుడు బాలకృష్ణ మాట్లాడిన వీడియోలో కొంత భాగాన్ని టీజర్‌ ప్రారంభంలో పొందుపరిచారు. "ఇతడు హర్ష్‌.. సినిమా హీరో.. అతడు కూడా వర్జిన్‌.. అదే ఇవాళే పుట్టాడు, ఇతడి పుట్టినరోజు నేడు. ఇతడికి పాపం, పుణ్యం ఏం తెలీదు.." అన్న బాలయ్య  స్పీచ్‌తోనే నవ్వులు పూయించేశారు. బాలయ్య మాటలకు హర్ష్‌ సిగ్గుతో చచ్చిపోవడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడున్నవాళ్లు కూడా ముసిముసిగా నవ్వుకున్నారు. 

ఇక టీజర్‌ విషయానికి వస్తే... "వరుణ్‌... నాకిద్దరు పిల్లలు కావాలి" అని హీరోను అడుగుతోంది హీరోయిన్‌. ఆ తర్వాత వచ్చే సన్నివేశాల్లోనేమో నువ్వింకా ఎదగాలని చెప్తోంది. అటు హీరో కూడా ఓవైపు ప్రియురాలితో పెళ్లికి ఓకే అంటూనే ఆమె అక్కనూ లైన్‌లో పెడుతున్నాడు. వినోదభరితంగా సాగిన ఈ టీజర్‌లో నటన, డైలాగులు బాగున్నాయి. సంగీత దర్శకుడు కోటి ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకు జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వం వహిస్తున్నాడు. వర్గో పిక్చర్స్‌ బ్యానర్‌పై అద్వయ జిష్ణురెడ్డి, శిల్పా చౌదరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

చదవండి: తమిళ స్టార్‌ హీరో సినిమాలో బేబమ్మకు ఛాన్స్!‌

ఇష్క్‌ ట్రైలర్: ఓ ముద్దిస్తావా?

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు