'డింపీ ఆఫ్‌ మీర్జాపూర్‌' ఇంటర్వ్యూ

27 Dec, 2020 10:36 IST|Sakshi

అందానికి తగ్గ తెలివి.. తెలివికి తగ్గ్గ టాలెంట్‌.. అన్నీ కలబోస్తే హర్షితా గౌర్‌. పొగడ్త కాస్త ఎక్కువైందనిపిస్తే.. ఆమె గురించి పూర్తిగా తెలుసుకోవాల్సిందే. 

నటనలో, నృత్యంలో, చదువులో ఇలా పోటీ దేనిలో అయినా.. ఎవరితో అయినా.. ముందుండాలనే తపనే హర్షితని ప్రత్యేకంగా నిలబెట్టింది. వైద్యుల కుటుంబం నుంచి వచ్చిన ఈ బాలీవుడ్‌ భామ.. ‘ఫలక్‌నుమాదాస్‌’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అయితే వెబ్‌ సిరీస్‌ ప్రియులు మాత్రం హర్షితని.. ‘డింపీ పండిట్‌’గా గుర్తుపడతారు.
హర్షితా గౌర్‌ 1992 అక్టోబర్‌12న ఢిల్లీలో జన్మించింది. తండ్రి చంద్రశేఖర్‌ గౌర్, తల్లి నీనా గౌర్‌ ఇద్దరూ డాక్టర్సే.
హర్షిత నోయిడాలోని అమిటీ యూనివర్సిటీలో బ్యాచిలర్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్‌ – కమ్యూనికేషన్స్‌లో డిగ్రీ పొందింది.
కెరీర్‌ మొదట్లో మోడలింగ్‌ చేసిన హర్షిత.. చదువుకునే రోజుల్లోనే ‘సద్దా హక్‌’ షోకి జరిగిన ఆడిషన్‌లో సెలెక్ట్‌ అయ్యింది. 2013లో ఆ షో ప్రసారమైన తర్వాత హర్షిత.. సంయుక్తా అగర్వాల్‌ (సద్దా హక్‌లో పాత్ర పేరు)గా మారిపోయింది. ఆ షో 5 వందలకు పైగా ఎపిసోడ్స్‌ పూర్తి చేసుకుంది. అందులోని కోస్టార్‌ పరమ్‌ సింగ్‌కి, హర్షితకి మధ్య నడిచే కెమెస్ట్రీ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. అయితే రియల్‌ లైఫ్‌లో కూడా హర్షిత, పరమ్‌సింగ్‌ మధ్య కొన్నాళ్లు రిలేషన్‌ నడిచింది. (చదవండి: 2020 ఇంట్లో కూడా సినిమా చూపించింది)

మలయాళీ చిత్రం అంగమలై డైరీస్‌కి రీమేక్‌ అయిన ఫలక్‌నుమా దాస్‌ సినిమాలో.. హీరో విశ్వక్‌ సేన్‌ పక్కన నటించిన హర్షిత గౌర్‌.. తెలుగు ప్రేక్షకుల మనసుల్ని దోచింది. 
2017లో ‘బ్లాక్‌ కాఫీ’ అనే వెబ్‌ సిరీస్‌లో.. 2018లో ‘ అమన్‌’ అనే షార్ట్‌ ఫిలిమ్‌లో ప్రధాన పాత్రలు పోషించింది.  2018లో  ‘బ్రైబ్‌’ ఆ తర్వాత ఏడాది ‘పంచ్‌ బీట్‌’ వెబ్‌ సిరీస్‌లలోనూ నటించి మెప్పించింది. 
తాజాగా మీర్జాపూర్‌ 1, 2 సిరీస్‌లో డింపీ పండిట్‌ అనే పాత్రలో వెబ్‌ వీక్షకులకు ఇంకా దగ్గరైన హర్షిత.. ‘డింపీ ఆఫ్‌ మీర్జాపూర్‌’గా గుర్తింపు తెచ్చుకుంది.
ఒత్తిడిని అధిగమించడానికి మీరు వెతికే పరిష్కారం ఏమిటి అని హర్షితని అడిగితే.. ‘సమస్య రాగానే.. గతంలోని సంతోషకరమైన ఓ ఐదు సందర్భాలను గుర్తు చేసుకుంటాను. మీరూ ట్రై చెయ్యండి..’ అంటోంది ఈ ఫలక్‌నుమా నాయిక.  (చదవండి: ‘ముద్దు సీన్‌ గురించి అమ్మతో చర్చించాకే..’)

మరిన్ని వార్తలు