సస్పెన్స్‌ బహుముఖం

28 Jan, 2024 01:12 IST|Sakshi

హర్షివ్‌ కార్తీక్‌ హీరోగా నటించి, రచించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘బహుముఖం’. ‘గుడ్, బ్యాడ్‌ – యాక్టర్‌’ అనేది ట్యాగ్‌లైన్‌. క్రిస్టల్‌ మౌంటైన్‌ ప్రోడక్షన్స్‌పై రూపొందిన ఈ చిత్రంలో స్వర్ణిమా సింగ్, మరియా మార్టినోవా హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం నుంచి హర్షివ్‌ కార్తీక్‌ ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేశారు మేకర్స్‌.

ఈ సందర్భంగా హర్షివ్‌ కార్తీక్‌ మాట్లాడుతూ– ‘‘సస్పెన్స్, డ్రామా, థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘బహుముఖం’. ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: అరవింద్‌ రెడ్డి, కెమెరా: ల్యూక్‌ ఫ్లెచర్, నేపథ్య సంగీతం: శ్రీచరణ్‌ పాకాల, సంగీతం: ఫణి కల్యాణ్‌.   

whatsapp channel

మరిన్ని వార్తలు