కత్రినా ఇంట్లో విక్కీ, వాళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారు

9 Jun, 2021 18:08 IST|Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కత్రినా కైఫ్‌, యంగ్‌ హీరో విక్కీ కౌశల్‌ మధ్య ప్రేమాయణం నడుస్తోందని కొంతకాలంగా వార్తలు షికార్లు చేస్తున్నాయి. వీళ్లిద్దరూ తరచూ కలుసుకుంటూ చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో పాటు విక్కీ ఏకంగా ఆమె ఇంటికి కూడా వెళ్లడంతో అది నిజమేనని అభిప్రాయపడుతున్నారు అభిమానులు. అయితే ఆ మధ్య విక్కీని కత్రినాతో నీ పెళ్లెప్పుడు? అంటే అలాంటిదేం లేదని సమాధానమిచ్చాడు. తాము బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అని తానింకా సింగిలే అని చెప్పుకొచ్చాడు. 

కానీ ఇదంతా పచ్చి అబద్ధమంటున్నాడు నటుడు హర్షవర్ధన్‌ కపూర్‌. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'విక్కీ, కౌశల్‌ ప్రేమించుకుంటున్నారు. ఇదే నిజం అని కుండ బద్ధలు కొట్టేశాడు. ఈ వ్యవహారాన్ని బయటపెట్టినందుకు బహుశా నాకు ఇబ్బందులు తప్పవేమో! అదంతా ఏమో కానీ త్వరలోనే వారు కూడా దీని గురించి స్పందిస్తారని భావిస్తున్నాను' అని తెలిపాడు.

ఇక జూన్‌ 7న విక్కీ కౌశల్‌ ప్రియురాలు కత్రినా ఇంటికి వెళ్లినట్లు బాలీవుడ్‌ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో ఆమె ఇంట్లోకి వెళ్లిన విక్కీ రాత్రి 8.30 గంటలకు ప్రియురాలికి వీడ్కోలు పలికి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది. దీంతో సోషల్‌ మీడియాలో ఈ కపుల్‌ లవ్‌ మ్యాటర్‌ మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది.

ఇదిలా వుంటే కత్రినా చివరిసారిగా 'భారత్‌' చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం ఆమె 'సూర్యవంశీ', 'ఫోన్‌ బూత్‌' చిత్రాల్లో నటిస్తోంది. 'భూత్‌ పార్ట్‌ 1'లో చివరిసారిగా కనిపించిన విక్కీ కౌశల్‌ ప్రస్తుతం 'ద ఇమ్మోర్టల్‌ ఆఫ్‌ అశ్వత్థామ', 'సర్దార్‌ ఉద్దమ్‌ సింగ్‌' సినిమాలతో పాటు ఓ బయోపిక్‌ చేస్తున్నాడు.

చదవండి: ‘ఇద్దరితో బ్రేకప్‌.. అతడిని ఎలా లవ్‌ చేస్తున్నావ్‌?’

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు