అందుకు నా డీఎన్‌ఏనే తప్పుబట్టాలి: నటుడు

30 Oct, 2020 11:19 IST|Sakshi

అందుకు నా డీఎన్‌ఏనే తప్పుపట్టాల్సి ఉంటుంది: నటుడు

ముంబై: ‘‘ఇందులో దాచడానికి ఏమీ లేదు. మేము కొన్నాళ్లపాటు కలిసే ఉన్నాం. కానీ ఇప్పుడు ఆ బంధం ముగిసిపోయింది’’అంటూ నటుడు హర్షవర్ధన్‌ రాణే తన బ్రేకప్‌ గురించి చెప్పుకొచ్చాడు. తన వ్యవహారశైలి, ఆలోచనా విధానమే కిమ్‌ శర్మ నుంచి తనను దూరం చేశాయన్నాడు. అయితే ఆమెతో గడిపిన సమయం జీవితంలోనే అత్యంత మధుర జ్ఞాపకాలను మిగిల్చిందని, ఈ భూమి మీద ఉన్న హాస్యచతురత గల మనుషుల్లో కిమ్‌ ముందు వరుసలో ఉంటుందన్నాడు. కాగా తకిట తకిట మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైన హర్షవర్ధన్‌... రవిబాబు ‘అవును’, ‘అవును2’ చిత్రాల ద్వారా ఫేమస్‌ అయిన సంగతి తెలిసిందే. శేఖర్‌ కమ్ముల ‘ఫిదా’ సినిమాలో అతిథి పాత్రలో కన్పించాడు. (చదవండి: షారుఖ్‌ ‘మన్నత్’‌ను అమ్మేస్తున్నాడా?!)

ఇక 2016లో సనమ్‌ తేరీ కసమ్‌ ద్వారా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన హర్షవర్ధన్‌, ప్రస్తుతం తైష్‌ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. జీ5 ఓటీటీ ప్లాట్‌ఫాంలో విడుదలయ్యేందుకు ఈ మూవీ సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఓ వెబ్‌సైట్‌తో ముచ్చటించిన అతడు తన వృత్తిగత, వ్యక్తిగత జీవితం గురించి పలు విషయాలు వెల్లడించాడు. కిమ్‌ శర్మ, తాను ప్రేమలో ఉన్నట్లు హర్షవర్దన్‌ గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే ఈ జంట గుడ్‌బై చెప్పుకొంది. ఈ క్రమంలో.. ‘‘నీతో గడిపిన సమయం అత్యద్భుతం. ఆ దేవుడు నిన్నూ, నన్నూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. బై’’అంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ షేర్‌ చేశాడు. ఈ విషయం గురించి తాజాగా మాట్లాడుతూ.. ‘‘నా డీఎన్‌ఏలోనే ఏదో తప్పు జరిగింది. 12 ఏళ్లపాటు నేను ఒంటరిగానే ఉన్నాను. నిజానికి ఏ కారణం లేకుండా ఎవరూ విడిపోరు. 

ఇప్పుడు నా వధువు స్వతంత్రురాలు. అలాగే సినిమానే ఇప్పుడు నా పెళ్లికూతురు’’ అంటూ రంగ్‌ దే బసంతి సినిమాలోని డైలాగ్‌ను ఉటంకిస్తూ, ఇకపై కెరీర్‌పైనే తాను దృష్టి సారించనున్నట్లు వెల్లడించాడు. ఇక ‘మొహబ్బతే’ సినిమాతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన కిమ్‌ శర్మ.. ఫిదా, తుమ్‌సే అచ్చా కౌన్‌ హై, కహెతా హై దిల్‌ బార్‌ బార్‌ వంటి సినిమాల్లో నటించింది. తెలుగులో ఖడ్గం సినిమాలో మెరిసిన ఈ భామ.. ‘మగధీర’లో ప్రత్యేక గీతంలో నర్తించింది. 2010లో వ్యాపారవేత్త అలీ పుంజానీని పెళ్లాడిన కిమ్‌... విభేదాల కారణంగా ప్రస్తుతం భర్తకు దూరంగా ఉంటోంది.(యువీ హార్ట్‌ టచింగ్‌ పోస్ట్‌: కిమ్‌ రిప్లై)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు