సుశాంత్ తండ్రికి హ‌ర్యానా సీఎం పరామర్శ

8 Aug, 2020 16:19 IST|Sakshi

చంఢీగ‌డ్ : హ‌ర్యానా ముఖ్య‌మంత్రి మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్ శ‌నివారం సుశాంత్ సింగ్‌ తండ్రి కేకే సింగ్‌ని ప‌రామ‌ర్శించారు. ఫ‌రిదాబాద్‌లోని సుశాంత్ సోద‌రి నివాసానికి స్వ‌యంగా వెళ్లిన ముఖ్యమంత్రి వారిని ఓదార్చారు. జూన్‌ 14న సుశాంత్‌ సింగ్‌ముంబైలోని బాంద్రాలో గల నివాసంలో ఆత్మహత్యకు పాల్పడిన తెలిసిందే. సుశాంత్ మృతికి రియానే కార‌ణ‌మంటూ కేకే సింగ్ ప‌ట్నా పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో ఈ కేసు అనూహ్య మ‌లుపు తిరిగింది. దీంతో కేసు విచార‌ణ‌ను సీబీఐకి అప్ప‌గించ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఈ కేసులో ప్ర‌ధాన నిందితురాలిగా రియా చ‌క్ర‌వ‌ర్తితో పాటు ఆమె కుటుంస‌భ్యుల‌ను పేర్ల‌ను ఎఫ్ఐఆర్‌లో పొందుప‌రిచింది. (తనపై అత్యాచారం జరుగలేదు, గర్భవతి కాదు)

ఇక సుశాంత్ కేసు విచార‌ణ మొద‌లైనప్ప‌టి నుంచి  అఙ్ఞాతంలోకి వెళ్లిపోయిన రియా చ‌క్ర‌వ‌ర్తి ఎట్ట‌కేల‌కు శుక్ర‌వారం ముంబైలోని ఈడీ కార్యాల‌యం ఎదుట హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. మొద‌ట తాను హాజ‌రుకానంటూ ఈ-మెయిల్ సందేశం పంపినా ఈడీ స‌మ‌స్ల నేప‌థ్యంలో హాజ‌రు కాక తప్ప‌లేదు. ఈ నేపథ్యంలో సుమారు 8 నుంచి తొమ్మిది గంటల పాటు అధికారులు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. కాగా సుశాంత్‌ అకౌంట్‌ నుంచి రియా దాదాపు 15 కోట్ల రూపాయల మేర తన అకౌంట్‌కు బదిలీ చేయించుకుందని అతడి తండ్రి కేకే సింగ్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే. (నా సొంత ఆదాయం నుంచే ఖర్చు: రియా )

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా