వివాదంలో ప్రముఖ కామెడీ షో

25 Aug, 2020 11:35 IST|Sakshi

‘పాట్రియాట్‌ యాక్ట్‌ విత్‌ హసన్‌ మిన్హాజ్‌’ అనేది ఒక అమెరికన్‌ కామెడీ, వెబ్‌ టెలివిజన్‌‌ షో. సమకాలీన రాజకీయాలకు సంబంధించిన విషయాలను కామెడీతో కలిపి జనాల ముందు ప్రదర్శిస్తారు. అయితే ప్రస్తుతం ఈ షో ఇబ్బందులను ఎదుర్కొంటుంది. దీని నిర్వహకులు విషపూరిత పని సంస్కృతిని పాటిస్తున్నారంటూ షో మాజీ నిర్మాత నూర్‌ ఇబ్రహీం నస్రీన్‌ సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఇవి తెగ వైరలవుతున్నాయి. ఈ సందర్భంగా నూర్‌ వరుస ట్వీట్లు చేశారు. ‘ఈ షోలో పని చేస్తున్నప్పుడు ఎన్నో అవమానాలు పొందాను. చాలా సార్లు నన్ను టార్గెట్‌ చేశారు. కొన్నిసార్లు కావాలనే విస్మరించేవారు. వీరు షోలో చూపించే నీతిని నిజంగా పాటిస్తే చాల బాగుండేది. చాలా మంది నన్ను ఈ షో గురించి మాట్లాడమని కోరేవారు. కానీ నేను తప్పించుకునేదాన్ని. ఈ షోలో ఎన్నో అవమానాలు పొందాను. చాలా సార్లు డిప్రెషన్‌కు గురయ్యాను. ఇప్పుడు ఇలా ట్వీట్‌ చేయడం వల్ల నాకు, నాలా బాధపడే ఇతరులకు ఎలాంటి ప్రయోజనం ఉండదు’ అన్నారు నూర్‌. (సూపర్‌ క్రేజ్‌.. 1.7 మిలియన్‌ లైక్స్‌)

అంతేకాక ‘కొందరు మహిళలు నాకంటే ధైర్యవంతులు. వారు దీని గురించి చర్చించారు. ఈ షో ఎంతో ముఖ్యమైనది.. ప్రముఖమైనది. ఇందుకు గాను నా పని పట్ల నేను చాలా గర్వంగా ఫీలవుతాను. నాకు లభించిన అవకాశాలకు నేను ధన్యవాదాలు తెలుపుతాను. అయితే గత కొద్ది నెలలుగా నేను అనుభవిస్తున్న మానసిక వేదనతో పోల్చితే.. ఇది అంత విలువైనదేం కాదని అర్థమవుతోంది. నిజంగానే మనకు ఓ దేశ భక్తి చట్టం ఉండాలని.. ఈ షో చూపించిన దానిని వారు నిజంగా పాటించాలని కోరుకుంటున్నారు. అప్పుడే వారు ప్రేక్షకుల ప్రేమకు అర్హులు’ అంటూ వరుస ట్వీట్లు చేశారు నూర్‌. రాజకీయాల మీద సెటర్లతో ఈ సాగే ‘పాట్రియాట్‌ యాక్ట్‌ షో’ మొదట అక్టోబర్‌ 28, 2018లో నెట్‌ఫ్లిక్స్‌లో ప్రదర్శితమయ్యింది. అప్పటి నుంచి ఆరు సీజన్లుగా 40 ఎపిసోడ్‌లు టెలికాస్ట్‌ అయిన ఈ షో ప్రస్తుతం ఆగిపోయింది. 

మరిన్ని వార్తలు