Raja Raja Chora: కథ లేకుండా కామెడీ నడిపించలేం! 

18 Aug, 2021 08:11 IST|Sakshi

‘‘చిన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే ఇష్టం. నేను, డైరెక్టర్‌ వివేక్‌ ఆత్రేయ బాల్య స్నేహితులం. ఇద్దరం కలిసి చేసిన షార్ట్‌ ఫిలింస్‌కు మంచి అభినందనలు వచ్చాయి. ‘మెంటల్‌ మది’లో చిత్రం ద్వారా తనకు డైరెక్టర్‌గా అవకాశం వచ్చింది. ఆ తర్వాత నేను కూడా ఎంట్రీ ఇచ్చాను’’ అని దర్శకుడు హసిత్‌ గోలి అన్నారు. శ్రీవిష్ణు హీరోగా మేఘా ఆకాశ్, సునైన హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రాజ రాజ చోర’. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదలవుతోంది.
(చదవండి: ఆ ఫొటో వల్లే సినిమా ఛాన్స్‌ వచ్చింది : వైశాలీ రాజ్‌)

ఈ సందర్భంగా చిత్రదర్శకుడు హసిత్‌ గోలి మాట్లాడుతూ– ‘‘మా నాన్న గోలి హనుమత్‌ శాస్త్రి గృహ నిర్మాణ శాఖలో సివిల్‌ ఇంజనీర్‌. ఆయనకు సాహిత్యం అంటే చాలా ఇష్టం. అందుకే నాకూ సాహిత్యంపై అభిరుచి పెరిగింది. శ్రీవిష్ణు నటించిన ‘బ్రోచెవారెవరురా’ సినిమాకి దర్శకత్వ శాఖలో చేశాను. అంతకు ముందే శ్రీవిష్ణుకి చెప్పిన కథతో సినిమా చేద్దామనుకున్నాం. అయితే, దానికన్నా మంచి ఐడియా రావడంతో ‘రాజ రాజ చోర’ను స్టార్ట్‌ చేశాం. శ్రీవిష్ణులోని కామెడీని పూర్తి స్థాయిలో మా సినిమాలో చూపిస్తున్నాం. ఓ దొంగ ఎందుకు దొంగతనాలు చేస్తున్నాడు? అనేది కామెడీ కోణంలో చూపించాం. అయితే బలమైన కథ లేకపోతే కామెడీతోనే సినిమా రన్‌ అవుతుందనుకోను. అందుకే మంచి కథ తయారు చేసుకున్నాను’’ అన్నారు.
(చదవండి: అంతదాకా వస్తే టీ.. కాఫీ అందించడానికీ రెడీయే!)

మరిన్ని వార్తలు