Hebah Patel: అనాధల రాత  మారుస్తానంటున్న ‘గీత’

14 Oct, 2021 15:30 IST|Sakshi

‘గీత’ షూటింగ్ పూర్తి-త్వరలో ఫస్ట్ లుక్

హెబ్బా పటేల్, సునీల్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘గీత’. ‘మ్యూట్ విట్నెస్’ అన్నది ఉప శీర్షిక.  ‘గ్రాండ్ మూవీస్‌’పతాకంపై ఆర్.రాచయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి వి.వి వినాయక్‌ శిష్యుడు విశ్వా.ఆర్.రావు దర్శకత్వం వహిస్తున్నాడు. ‘నువ్వే కావాలి’, ‘ప్రేమించు’చిత్రాల ఫేమ్ సాయి కిరణ్ ప్రతి నాయకుడిగా పరిచయమవుతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ సంచలన దర్శకులు వి.వి.వినాయక్ త్వరలో రిలీజ్ చేయనున్నారు.

రామ్ కార్తిక్, సప్తగిరి, రాజీవ్ కనకాల, పృథ్వి , తనికెళ్ళ భరణి, సంధ్యా జనక్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో సూపర్ గ్లామర్ హీరోయిన్ హెబ్బా పటేల్ అనాథల కోసం పోరాడే మూగ యువతిగా... ఓ చాలెంజింగ్ రోల్ చేస్తుండడం విశేషం.  సూర్య, లలిత, ప్రియ, మీనాకుమారి, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ దుర్గారావు తదితరులు ఇతర పాత్రలు ప్లే చేస్తున్న ఈ చిత్రానికి సుభాష్ ఆనంద్ సంగీతం అందిస్తున్నాడు.

మరిన్ని వార్తలు