Hello Evaru: సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ‘హలో ఎవరు?’

15 Mar, 2023 16:52 IST|Sakshi

టాలీవుడ్‌లో సస్పెన్స్‌ థ్రిల్లర్స్‌కు మంచి ఆదరణ ఉంది. అందుకే దర్శకనిర్మాతలు ఆ తరహా కథలను తెరకెక్కించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. త్వరలోనే తెలుగు ప్రేక్షకులను భయపెట్టడానికి మరో సస్పెన్స్‌ థ్రిల్లర్‌ రాబోతుంది. వెంక‌ట్‌రెడ్డి నంది ద‌ర్శ‌క‌నిర్మాణంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి ‘హలో ఎవరు?’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. . శ్రీ‌శివ‌సాయి ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రంతో జ‌య్ పాపిరెడ్డి క‌ట‌కం,  సౌమ్య‌శ్రీ ఉంత‌క‌ల్ హీరోహీరోయిన్లుగా, వినాయక్‌ విలన్‌గా పరిచయం కాబోతున్నారు.

ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఎడిటింగ్, డ‌బ్బింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డీఐ ప‌నులు జరుపుకుంటోంది. ఈ క్రైం ఆండ్ హ‌ర‌ర్ సస్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా ఈ సినిమాను తెర‌కెక్కించిన‌ట్టు ద‌ర్శ‌కనిర్మాత‌ వెంక‌ట్‌రెడ్డి నంది తెలిపారు. సినిమా చాలా బాగా వ‌చ్చింద‌ని, ఇండ‌స్ట్రీలో ఈ చిత్రానికి స్పెష‌ల్ క్రేజ్ రావ‌డం ఖాయ‌మ‌ని ఆయ‌న విశ్వాసం వ్య‌క్తం చేశారు. మే నెల‌లో 'హ‌లో ఎవ‌రు?' చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి చిత్ర‌యూనిట్ స‌న్నాహాలు చేస్తోంది. 

మరిన్ని వార్తలు