Mythological Pan India Movies: వెండితెరపై ‘పాన్‌ పురాణం’.. విశేషాలు ఏంటంటే

20 Sep, 2022 08:45 IST|Sakshi

రామాయణం, మహాభారతం.. ఇలా మన పురాణాల ఆధారంగా ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. నాటితరం నటీనటులు చేసిన సినిమాలను ప్రేక్షకులు ఆదరించారు. ఇప్పుడు నేటి తరం వంతు. పురాణాల ఆధారంగా పాన్‌ ఇండియా సినిమాలు వెండితెరపై ఆవిష్కృతం కానున్నాయి. ఆ ‘పాన్‌ పురాణం’ విశేషాలు తెలుసుకుందాం.

వెండితెరపై ప్రభాస్‌ కటౌట్‌ ఉందంటే ఆడియయన్స్‌ థియేటర్స్‌కు వచ్చేస్తారు. పాన్‌ ఇండియా స్టార్‌గా పాపులర్‌ అయిన ప్రభాస్‌ లేటెస్ట్‌గా ‘ఆదిపురుష్‌’ అనే మైథలాజికల్‌ ఫిల్మ్‌ చేశారు. ఈ చిత్రంలో రాముడు పాత్రలో ప్రభాస్, సీతగా కృతీ సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, రావణుడిగా సైఫ్‌ అలీఖాన్‌ నటించారు. ఓం రౌత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 12న రిలీజ్‌ కానుంది. మరోవైపు సమంత నటించిన తొలి మైథలాజికల్‌ మూవీ ‘శాకుంతలం’.

గుణశేఖర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ ప్రేమకావ్యంలో శకుంతల పాత్రలో సమంత, దుష్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్‌ మోహన్‌  నటించారు. ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది. ఇక గుణశేఖర్‌ దర్శకత్వంలోనే రానున్న మరో మైథలాజికల్‌ ఫిల్మ్‌ ‘హిరణ్య కశ్యప’. ఇందులో టైటిల్‌ రోల్‌లో రానా నటిస్తారు. మరోవైపు మహాభారతం ఆధారంగా సినిమా చేయాలన్నది తన డ్రీమ్‌ అని రాజమౌళి  పలు సందర్భాల్లో చెప్పారు.

సో... మహాభారతం ఆధారంగా రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ మల్టీస్టారర్‌ వచ్చే అవకాశం ఉంది. ఇక బాలీవుడ్‌ నిర్మాతలు మధు మంతెన, నమిత్‌ మల్హోత్రాలతో కలిసి టాలీవుడ్‌ అగ్ర నిర్మాతల్లో ఒకరైన అల్లు అరవింద్‌ రామాయణం ఆధారంగా ఓ మూవీ ప్లాన్‌ చేశారు. అలాగే వ్యాపారవేత్త బీఆర్‌ శెట్టి దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్‌తో మహాభారతం ఆధారంగా సినిమా తీయాలను కుంటున్నారు. అలాగే మలయాళ ఫిల్మ్‌ మేకర్‌ ఆర్‌.ఎస్‌ విమల్‌ ‘సూర్యపుత్ర మహావీర్‌ కర్ణ’ను ప్రకటించారు. ఈ సినిమా టైటిల్‌ రోల్‌లో విక్రమ్‌ నటిస్తారనే ప్రచారం జరుగుతోంది. 

మరిన్ని వార్తలు