వారిపై ద్వేషాన్ని వెళ్లగక్కడం వల్లే.. ‘సర్దార్‌ ఉద్ధం’ని ఆస్కార్‌కి సెలెక్ట్‌ చేయలేదు

25 Oct, 2021 10:39 IST|Sakshi

ఆస్కార్‌ 2022కి ఇండియా నుంచి తమిళ చిత్రం ‘కూజంగల్’ ఎంట్రీ సాధించిన విషయం తెలిసిందే.  మొత్తం 14 సినిమాలు నామినేట్‌ కాగా ఈ సినిమాని సెలెక్ట్‌ చేసింది 15 మంది సభ్యుల జ్యూరీ బృందం. అయితే అందులో స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్‌ ఉదమ్‌ సింగ్‌ జీవితకథతో తెరకెక్కిన ‘సర్దార్ ఉద్దం’ కూడా ఉంది. బాలీవుడ్‌ కుర్ర హీరో విక్కీ కౌశల్‌ నటించిన ఈ మూవీ ఇటీవలే ఓటీటీ ఫ్లాట్‌ ఫామ్‌ అమెజాన్‌లో విడుదలై మంచి ఆదరణ పొందింది. అలాంటి సినిమాని 94వ అకాడమీ అవార్డ్స్‌కి పంపకపోవడానికి కారణాన్ని తెలిపాడు జ్యూరీ సభ్యుడు ఇంద్రదీప్ దాస్‌గుప్త.

‘సర్దార్ ఉద్దం’ బ్రిటీష్ వారిపై ద్వేషాన్ని ప్రదర్శించే విధంగా ఉంటుంది కథ. అందుకే ఈ చిత్రాన్ని ఆస్కార్స్ నామినేషన్స్‌కి పంపేందుకు జ్యూరీ అంగీకరించదని ఇంద్రదీప్‌ తెలిపాడు. చరిత్ర మరిచిపోయిన ఓ పోరాట యోధుడి కథతో వచ్చిన ఈ సినిమా ఎంతో బావుందని, అయినప్పటికీ ప్రస్తుత గ్లోబలైజేషన్ శకంలో ద్వేషాన్ని ప్రతిబింబించటం అంత మంచిది కాదని ఆయన ఈ జ్యూరీ సభ్యుడు తెలిపాడు. అయితే ఆస్కార్‌ బరిలో నిలిచిన ‘కూజంగల్’ సినిమాని వినోద్‌ దర్శకత్వంలో నటి నయన తార, డైరెక్టర్‌ విఘ్నేశ్ శివన్ నిర్మించారు.

చదవండి: ఆ గాట్లు పెట్టినవి కాదు.. ఆ సినిమా సమయంలో నిజంగా అయ్యాయి: యంగ్‌ హీరో

మరిన్ని వార్తలు