Arun Vijay: తమిళ హీరో అరుణ్‌ విజయ్‌ 'ఆక్రోశం'..ఎవరిపైన?

9 Sep, 2022 16:54 IST|Sakshi

అరుణ్‌ విజయ్‌ హీరోగా నటించిన తమిళ చిత్రం ‘సినం’. జీఎన్‌ఆర్‌ కుమారవేలన్‌ దర్శకత్వంలో ఆర్‌. విజయ్‌కుమార్‌ నిర్మించిన చిత్రం ఇది. ఈ యాక్షన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ను తెలుగులో ‘ఆక్రోశం’ పేరుతో సీహెచ్‌ సతీష్‌ కుమార్, జగన్మోహనిలు విడుదల చేస్తున్నారు. త్వరలో ఈ చిత్రం రిలీజ్‌ కానుంది.

సీహెచ్‌ సతీష్‌కుమార్‌ మాట్లాడుతూ – ‘‘నిర్మాతగా కాకుండా ఓ ఆడియన్‌గా ‘సినం’ ట్రైలర్‌ చూసి ఆశ్చర్యపోయాను. తెలుగులో ఈ సినిమాను విడుదల చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. మంచి సినిమా చూశామనే అనుభూతిని ప్రేక్షకులు పొందుతారు’’ అన్నారు.

మరిన్ని వార్తలు