ఫోన్‌ విసిరేసిన బాలకృష్ణ : వైరల్‌ వీడియో

17 Nov, 2020 18:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : చిత్ర విచిత్ర  వ్యాఖ్యలు, వింత ప్రవర్తనతో వార్తల్లో నిలిచే టీడీపీ ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ట మరోసారి తన ప్రకోపాన్ని ప్రదర్శించారు. సందర్బం​ ఏదైనా, సమయం ఏదైనా తనకు  కోపం వస్తే నేనింతే అంటూ బాలయ్య బాబు రియాక్ట్ అయిన తీరు ట్రెండింగ్‌లో నిలిచింది. ఒక సినిమా పోస్టర్‌ రిలీజ్‌ ఫంక్షన్‌లో బాలకృష్ణ కోపంతో సెల్ ఫోన్ విసిరేశారు. దీంతో అక్కడున్నవారంతా ఒక‍్కసారిగా షాక్‌ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో  వైరల్ అవుతోంది.

హర్ష కనుమల్లి, సిమ్రాన్ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న “'సెహరి” సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్  లాంచింగ్‌కు నందమూరి బాలకృష్ణ ప్రముఖ అతిథిగా  హాజరయ్యారు. ఈ సందర్భంగా మూవీ పోస్టర్‌ రిలీజ్‌కు బాలకృష్ణ సన్నద్దమవుతున్నారు. ఇంతలో  ఫోన్ రింగ్ అయింది. అంతే.. జేబులో నుంచి  ఫోన్‌ తీసి పరిశీలించిన బాలయ్య, నెంబర్ చూసి మరీ ఫోన్‌ను అలా గాల్లోకి  క్యాచ్‌ విసిరారు. అలా ఆయన  స్టేజిపై నుంచే  ఫోన్ విసిరేయటంతో  సినిమా యూనిట్ సభ్యులు అంతా ఒక్క క్షణం బిక్క చచ్చిపోయారు.

దీంతో నెటిజన్లు వ్యంగ్య కామెంట్లు, మీమ్స్‌తో సందడి చేస్తున్నారు. కోపదారి మనిషికి ఆ సమయంలో ఎవరబ్బా ఫోన్‌  చేసింది.. ఖచ్చితంగా ఎవరో బాలయ్య బాబుకు కోపం తెప్పించే వ్యక్తి ఫోన్ చేసి ఉంటారంటూ  సోషల్ మీడియాలోకామెంట్ చేస్తున్నారు. అంతేకాదు ఈ సందర్భంగా సినిమాని ప్రేమించండి.. సినిమా అనేది ఒక ప్యాషన్‌.. సినిమా అంటే పిచ్చి ఉండకూడదు.. అంటూ చిత్రయూనిట్‌కు బాలయ్య ఇచ్చిన సలహాపై నెటిజన్లు విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు.  కరోనా వైరస్ కారణంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, కరోనాకి వ్యాక్సిన్ ఇంకా రాలేదు.. ఇకముందు రాదు కూడా.. దాని సంగతి నాకు తెలుసు అంటూ వ్యాఖ్యానించి సంచలనం రేపారు.  (గుర్తుపట్టలేనంతగా మారిపోయిన కమెడియన్‌)

A post shared by Punch Siksha (@punchsiksha)

A post shared by hakunamatata3 (@hakunamatataaa_3)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా