Dhanush Got Best Actor Award: ధనుష్‌ను వరించిన బ్రిక్స్‌ అవార్డు.. ఎందుకో తెలుసా ?

29 Nov, 2021 13:30 IST|Sakshi

Hero Dhanush Got Best Actor Award In BRICS Film Festival: తమిళ స్టార్‌ హీరో ధనుష్‌కు మరో గౌరవం దక్కింది. నవంబర్‌ 28న జరిగిన బ్రిక్స్‌ (BRICS) ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో 'అసురన్‌' చిత్రానికి గాను ధనుష్‌ని ఉత్తమ నటుడి అవార్డు వరించింది. ఇటీవల గోవాలో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (IIF)తో పాటు బ్రిక్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ కూడా జరిగింది. ఈ ఆనందకర విషయాన్ని ధనుష్‌ ట్విటర్‌లో పంచుకున్నాడు. ఈ అవార్డు గురించి చెబుతూ 'ఒక పరిపూర్ణ గౌరవం' అని ట‍్వీట్‌ చేశాడు.  అలాగే ఈ సినిమాకు 3 జాతీయ అవార్డులు వచ్చాయి. వి క్రియేషన్స్‌ పతాకంపై కలైపులి ఎస్ థాను నిర్మించిన ఈ చిత్రానికి వెట్రిమారన్‌ దర్శకత‍్వం వహించాడు. 

ఈ అసురన్‌ సినిమా పూమణి రచించిన వెక్కయ్‌ నవల ఆధారంగా తీసిన పీరియాడికల్ చిత్రం. ఇందులో ధనుష్‌, మంజూ వారియర్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. 'అసురన్‌' సినిమాను 78వ గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్స్‌లో 'ఉత్తమ విదేశీ చిత్రం' కేటగిరీ కింద ప్రదర్శించారు. ఈ చిత్రాన్ని తెలుగులో విక్టరీ వెంకటేష్‌, ప్రియమణి లీడ్ రోల్స్‌లో నారప్ప పేరుతో రీమెక్‌ చేసిన సంగతి తెలిసిందే. ధనుష్‌ చివరిగా కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో వచ్చిన జగమే తంధిరమ్‌ సినిమాలో నటించాడు. ఇది నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ప్రస్తుతం మారన్‌, తిరుచిత్రంబళం షూటింగ్‌లో బిజీగా ఉ‍న్నాడు ధనుష్‌.

మరిన్ని వార్తలు