Dhanush: ధనుష్​కు కరోనా పాజిటివ్​.. ఇక 'సార్'​కు బ్రేక్​

25 Jan, 2022 20:57 IST|Sakshi

Hero Dhanush Tests Positive For Covid 19: తమిళ స్టార్ హీరో ధనుష్​కు కోలీవుడ్​లోనే కాకుండా టాలీవుడ్​లో కూడా అభిమానులు ఉన్నారు. ఈ క్రేజ్​తోనే తెలుగులో నేరుగా ధనుష్​ ఒక సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా పేరే 'సార్'​. వెంకీ అట్లూరీ డైరెక్ట్​ చేస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళం రెండు భాషల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇటీవలే చిత్రీకరణ మొదలైన ఈ చిత్రాన్ని తమిళంలో 'వాత్తి' పేరుతో విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ధనుష్​ సోదరుడు డైరెక్టర్​ సెల్వ రాఘవన్​కు కరోనా సోకిన విషయం తెలిసిందే. తాజాగా ధనుష్ కూడా​ కరోనా బారిన పడ్డారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ధనుష్​ కొవిడ్​ పరీక్షలు చేయించుకోవడంతో కరోనా పాజిటివ్​ అని తేలింది. 

దీంతో 'సార్​' సినిమా షూటింగ్​కు బ్రేక్​ పడింది. ధనుష్​కు కరోనా అని తేలగానే 'సార్'​ చిత్రీకరణ ఆపేశారు. ప్రస్తుతం ధనుష్​ హోం ఐసోలేషన్​లో వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకుంటున్నారు. వారం, పదిరోజుల వరకూ ధనుష్​ 'సార్'​ చిత్రీకరణలో పాల్గొనే అవకాశం లేదు. అయితే ఇటీవలే హైదరాబాద్​లో షూటింగ్​ ప్రారంభించిన చిత్రబృందం ఈ షెడ్యూల్​ను భారీగా ప్లాన్​ చేశారని టాక్​. ఎక్కువ సీన్లు ధనుష్​పైనే ఉండటంతో ఆయన పూర్తిగా కోలుకునే వరకు ఈ సినిమా షూటింగ్​ ముందుకు వెళ్లనట్లే అని సమాచారం. సితారా ఎంటర్​టైన్​మెంట్స్​, ఫొర్చ్యూన్ ఫోర్​ సినిమాస్​ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ధనుష్​ టీచర్​గా కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

మరిన్ని వార్తలు