శివశంకర్‌ మాస్టర్‌ సేవలు మరువలేనివి : హీరో కార్తి

30 Nov, 2021 08:18 IST|Sakshi

Hero Karthi Condolences To Late Shivashankar Master: నృత్య దర్శకుడు, నటుడు శివ శంకర్‌ భారతీయ సినిమాకు చేసిన సేవలు అపారమని నటుడు కార్తీ పేర్కొన్నారు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో కన్నుమూసిన శివ శంకర్‌ మాస్టర్‌ భౌతిక కాయానికి సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన మృతి యావత్‌ సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

‘శివశంకర్‌ భారతీయ సినిమాకు చేసిన సేవలు అపారం..ఆయన కుటుంబానికి  నా ప్రగాఢ సంతాపం’ అని సోమవారం ట్వీట్‌ చేశారు. అదేవిధంగా ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు తంగుటూరి రామకృష్ణ శివశంకర్‌ మాస్టర్‌ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాస్టర్‌తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పలు చిత్రాలకు శివశంకర్‌ మాస్టర్‌తో కలిసి పని చేసే అవకాశం తనకు కలిగిందని పేర్కొన్నారు. ఆయన మరణం భారతీయ సినిమాకు తీరని లోటు అని అన్నారు.  

మరిన్ని వార్తలు