షాక్‌ : కార్తీని గుర్తుపట్టలేకపోయిన హీరో విజయ్‌

19 Jul, 2021 08:10 IST|Sakshi

‘బీస్ట్‌’ సెట్స్‌కు వెళ్లారు ‘సర్దార్‌’. హీరో విజయ్, దర్శకుడు నెల్సన్‌ కుమార్‌ కాంబినేషన్‌లో ‘బీస్ట్‌’ సినిమా షూటింగ్‌ చెన్నైలోని ఓ ప్రముఖ స్టూడియోలో జరుగుతోంది. అదే లొకేషన్‌కు సమీపంలో కార్తీ హీరోగా నటిస్తున్న ‘సర్దార్‌’ సినిమా చిత్రీకరణ జరగుతోంది. పీఎస్‌ మిత్రన్‌ ఈ సినిమాకు దర్శకుడు. దాదాపు రెండు కోట్ల ఖర్చుతో వేసిన సెట్‌లో సర్దార్‌ షూటింగ్‌ చేస్తున్నారు.

ఈ సినిమా షాట్‌ గ్యాప్‌లో ‘సర్దార్‌’ గెటప్‌లోనే ‘బీస్ట్‌’ సెట్స్‌కి కార్తీ వెళ్లారు. ఆ గెటప్‌లో కార్తీని గుర్తుపట్టలేకపోయారు విజయ్‌. ఆ తర్వాత విజయ్‌తో కార్తీ మాట్లాడటం మొదలుపెట్టాక అసలు విషయం తెలిసి, విజయ్‌ షాక్‌ అయ్యారట. కాసేపు హీరోలిద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకున్నారని సమాచారం. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు