అంగరంగ వైభవంగా హీరో కార్తికేయ పెళ్లి.. ఫోటోలు వైరల్‌

21 Nov, 2021 13:42 IST|Sakshi

Karthikeya Marriage Photos: యంగ్‌ హీరో కార్తికేయ ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రియురాలు లొహితా రెడ్డిని పెళ్లి చేసుకున్నాడు. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్‌ జరిగిన ఈ వివాహ వేడుకకి మెగాస్టార్‌ చిరంజీవి, అల్లు అరవింద్‌, తణికెళ్ల భరణి, అజయ్‌ భూపతి, పాయల్‌ రాజ్‌పుత్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అందులో వరుడు కార్తికేయ క్రీమ్, బంగారు షేర్వాణీతో జతగా క్రీమ్ లోఫర్‌లు, మ్యాచింగ్ పగడి, బ్రూచ్, నెక్లెస్ ధరించి కన్పించాడు. పెళ్లికూతురు కూడా బంగారు రంగు దుస్తుల్లో, వాటికి తగ్గ జ్యూవెలరీలో మెరిసిపోయింది.

కార్తికేయ వరంగల్‌ లో ఎన్ఐటి విద్యార్థిగా ఉన్నప్పడు లొహితతో పరిచయం ఏర్పడింది.  2012లో ఆమెకు ప్ర‌పోజ్ చేశాడు. కానీ హీరో అయ్యాకే మీ ఇంటికి వ‌చ్చి మాట్లాడ‌తాన‌ని చెప్పాడు. హీరో అవ్వ‌డానికి ఎంత క‌ష్ట‌ప‌డ్డాడో త‌న ప్రేమ‌ను గెలిపించుకోవ‌డానికీ అంతే క‌ష్ట‌ప‌డ్డాడు. ఫైన‌ల్‌గా యూత్ హీరోగా నిల‌దొక్కుకున్నాక పెద్ద‌ల‌ను ఒప్పించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇక సినిమా విషయాలకొస్తే.. కార్తికేయ ఇటీవల ‘రాజా విక్రమార్క’తో ప్రేక్షకులను పలకరించాడు. ఆ సినిమాకు బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ స్పందన వచ్చింది. ప్రస్తుతం తల అజిత్  ‘వాలిమై’లో విలన్ గా నటిస్తున్నాడు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు