మరో డిఫరెంట్‌ థీమ్‌తో వస్తున్న హీరో లక్ష్‌, ఫస్ట్‌లుక్‌తోనే అదరగొట్టాడు

24 Aug, 2021 14:57 IST|Sakshi

వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ ప్రేక్షకులకు మంచి సినిమాలు అందిస్తున్నాడు యంగ్‌ హీరో లక్ష్‌ చదలవాడ. డిఫరెంట్‌ పాత్రలను ఎంచుకుంటూ యువ దర్శకుటను పోత్సహిస్తున్న కథానయకుడుగా పేరు తెచ్చుకున్నాడు. వలయం వంటి థ్రిల్లర్‌ మూవీతో ఆడియెన్స్‌ను మెప్పించిన ఈ యంగ్‌ హీరో మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో అలరించేందుకు రెడీ అయ్యాడు. తొలి చిత్రం తర్వాత ఏదో సినిమా చేసేయాల‌నే ఆలోచ‌న‌తో కాకుండా కాస్త గ్యాప్ తీసుకుని త‌న‌దైన పంథాలో ‘గ్యాంగ్‌స్ట‌ర్ గంగ‌రాజు’ అనే డిఫ‌రెంట్ మూవీతో ప్రేక్షకుల ముద్దుకు వస్తున్నాడు ల‌క్ష్‌.

చదవండి: ఉపాసన రామ్‌చరణ్‌ని 'మిస్టర్‌ సి' అని ఎందుకు పిలుస్తుందంటే..

‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ అనే క్యాచీ అండ్ క్రేజీ టైటిల్‌కి తోడు ప్రేక్షకులు థ్రిల్ అయ్యే కథాంశాన్ని యంగ్ డైరెక్టర్ ఇషాన్ సూర్య ప్రేక్ష‌కుల ముందుకు తేనున్నారు. ప్రముఖ హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై చదలవాడ బ్రదర్స్ సమర్పణలో పద్మావతి చదలవాడ నిర్మిస్తున్న ఈ చిత్ర టైటిల్ ఫస్ట్‌లుక్ పోస్టర్  మంగళవారం విడుదలైంది.  ఈ ఫస్ట్‌లుక్‌లో చూట్టు పహిల్వాన్స్‌ సీరియస్‌గా చూస్తుంటే వారి మధ్యలో లక్ష్‌ కూల్‌గా కొబ్బరి బొండాం తాగుతున్న ఈ పోస్టర్‌ ఆకట్టుకుంటుంది. హిట్ చిత్రాల సంగీత దర్శకుడు సాయి కార్తీక్ అద్భుతమైన ట్యూన్స్‌ను ఈ మూవీకి కంపోజ్ చేస్తున్నాడు. ఇందులో వేదిక దత్ హీరోయిన్‌గా నటిస్తుంది. అతి త్వ‌ర‌లోనే మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్‌ ప్ర‌క‌టించ‌నున్నారు.

చదవండి: ఆగస్ట్‌ చివరి వారం ఓటీటీ, థియేటర్స్‌లో సందడి చేసే చిత్రాలు ఇవే

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు