టైటిల్‌ పాజిటివ్‌గా ఉంది

17 Aug, 2022 05:33 IST|Sakshi

– నాగశౌర్య  

‘‘హైవే’ టైటిల్‌ పాజిటివ్‌గా ఉంది. ట్రైలర్‌ చూడగానే ‘ఆవారా, రాక్షసుడు’ చిత్రాలు చూసినట్టుంది. ఇలాంటి మంచి సినిమాలు తీస్తున్నందుకు నిర్మాత వెంకట్‌గారికి థ్యాంక్స్‌’’ అని హీరో నాగశౌర్య అన్నారు. ఆనంద్‌ దేవరకొండ, మానస జంటగా కేవీ గుహన్‌             దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హైవే’. నార్త్‌స్టార్‌ సమర్పణలో శ్రీ ఐశ్వర్యలక్ష్మి మూవీస్, వెంకట్‌ తలారి ప్రొడక్షన్స్‌లో    రూపొందిన ఈ సినిమా ఈ నెల 19న ‘ఆహా’ ఓటీటీలో రిలీజ్‌ అవుతోంది.

ఈ సినిమా ట్రైలర్‌ను నాగశౌర్య విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘నాకు లవర్‌ బాయ్‌ అని ప్రేక్షకులు ట్యాగ్‌ ఇచ్చారు. కానీ ఆనంద్‌కి ఎలాంటి ట్యాగ్‌ లేకపోవడంతో వేర్వేరు జానర్ల సినిమాలను చేస్తున్నారు.. అది చాలా గొప్ప లక్షణం’’ అన్నారు. ‘‘హైవే’ చక్కని ప్రయోగాత్మక చిత్రం’’ అన్నారు ఆనంద్‌ దేవరకొండ. ‘‘సరికొత్త కథాంశంతో రూపొందిన మా సినిమాను ప్రేక్షకులు          ఆదరిస్తా రని ఆశిస్తున్నాను’’ అన్నారు కేవీ గుహన్‌.     ‘‘అద్భుతమైన థ్రిల్లర్‌ చిత్రం ఇది’’ అన్నారు నిర్మాత శరత్‌ మరార్‌. ‘ఆహా’ మార్కెటింగ్‌ హెడ్‌ కార్తీక్, హీరోయిన్‌ మానస మాట్లాడారు.    

మరిన్ని వార్తలు