ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌కు నాని సర్‌ప్రైజ్‌.. పోస్ట్‌ వైరల్‌!

9 Jun, 2021 11:33 IST|Sakshi

కరోనా కాలంలో ప్రజల ప్రాణాలకు తమ ప్రాణాలు అడ్డుగా సైనికుల్ల మహమ్మారిపై యుద్దం చేస్తున్న ఫ్రంట్‌ లైన్‌ వర్కర్స్‌కు హీరో నాని ఓ సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్నాడు. ప్రజలను కరోనా కటేయకుండా డాక్టర్లు, నర్సులు, పోలీసులు ముందు వరుసలో నిలబడి అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నారు. కరోనాతో పోరాటంలో ఎంతో మంది ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌ ప్రాణాలను కూడా కోల్పోయారు. అలాంటి వారి కోసం, ఇప్పటికీ మహమ్మారితో పోరాడుతున్న ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌ అయిన డాక్టర్స్‌, హెల్త్‌ డిపార్టుమెంట్‌లో పని చేస్తున్న నర్సులు, పోలీసుల నాని ఓ స్పెషల్‌ వన్‌ అంటు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు షేర్‌ చేశాడు. 

ఈ పోస్టులో నాని.. ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌ కోసం అంటూ మ్యూజిక్‌, డాక్టర్‌ ఎమోజీలకు లవ్‌ ఎమోజీలను జత చేసి ఫొటో షేర్‌ చేశాడు. ఈ ఫొటోలో నాని కెమెరాను పట్టుకుని డిస్‌ప్లేను గమనిస్తున్నాడు. తనతో మరికొందరూ కెమెరా వైపే సిరీయస్‌గా చూస్తున్నారు. అది చూసిన నెటిజన్లు నాని ఏం చేయబోతున్నాడో తెలియక జుట్టు పీక్కుంటు తమదైన శైలిలో స్పందిస్తుంటే మరి కొందరూ ఆ సర్‌ప్రైజ్‌ కోసం వెయింటిగ్‌ సార్‌ అంటు కామెంట్స్‌ చేస్తున్నారు. 

A post shared by Nani (@nameisnani)

చదవండి: 
‘సీత’ మూవీ మేకర్స్‌కు కరీనా షరతులు.. మరీ అంత రెమ్యునరేషనా?!
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు