ఆయనలా శ్రీ విష్ణు  పెద్ద స్టార్‌ అవ్వాలి: నాని 

17 Sep, 2022 11:16 IST|Sakshi
శ్రీవిష్ణు, బెక్కం వేణు గోపాల్‌, నాని

‘‘మహేశ్‌బాబుగారు బయట చాలా రిజర్వ్‌డ్‌గా ఉండి లోపల చాలా సరదాగా ఉంటారని విన్నాను. ఆయన తర్వాత శ్రీ విష్ణు ఆ కోవకి వస్తారు. తను కూడా మహేశ్‌గారిలా పెద్ద స్టార్‌ కావాలి’’ అని హీరో నాని అన్నారు. శ్రీ విష్ణు, కయదు లోహర్‌ జంటగా ప్రదీప్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అల్లూరి’. బెక్కెం బబిత సమర్పణలో బెక్కెం వేణుగోపాల్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను నాని విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘అల్లూరి’ ట్రైలర్‌ బావుంది.. సినిమా పెద్ద సక్సెస్‌ కావాలి. సినిమా చేస్తే హీరో కాకుండా పాత్రలు మాత్రమే కనిపించే హీరోలు చాలా తక్కువమంది ఉంటారు.. అలాంటి నటుల్లో ముందు వరుసలో ఉండే శ్రీ విష్ణు అంటే నాకు చాలా ఇష్టం’’ అన్నారు.

 ‘‘ఎంతోమంది నానీగారిని స్ఫూర్తిగా తీసుకొని ఇండస్ట్రీకి వస్తారు.. నాకు కూడా ఆయనే స్ఫూర్తి. గొప్ప కథతో రూపొందిన ‘అల్లూరి’ చిత్రాన్ని ఆదరించాలి’’ అన్నారు శ్రీ విష్ణు. ‘‘అద్భుతమైన కంటెంట్‌ ఉన్న సినిమా ‘అల్లూరి’. ట్రైలర్‌ అందరికీ నచ్చింది.. సినిమా అంతకంటే పెద్ద విజయం సాధిస్తుంది’’ అన్నారు బెక్కెం వేణుగోపాల్‌. గేయ రచయిత రాంబాబు గోసాల పాల్గొన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: నాగార్జున వడ్డే, సంగీతం: హర్షవర్ధన్‌ రామేశ్వర్, కెమెరా: రాజ్‌ తోట.

మరిన్ని వార్తలు