Hero Navdeep- Madhapur Drugs Case: ఎక్కడికి పారిపోలేదు.. సిటీలోనే ఉన్నా: నవదీప్‌

14 Sep, 2023 19:19 IST|Sakshi

మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో టాలీవుడ్‌కు చెందిన హీరో నవదీప్‌తో పాటు నిర్మాత సుశాంత్‌ రెడ్డి కూడా ఉన్నట్లు నగర పోలీసు కమీషనర్‌ సీవీ ఆనంద్‌వెల్లడించాడు. నవదీప్‌ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, త్వరలోనే అతన్ని పట్టుకుంటామని చెప్పాడు. దీనిపై హీరో నవదీప్‌ కూడా స్పందించాడు. అసలు ఆ డ్రగ్స్‌ కేసుతో తనకు సంబంధమే లేదన్నాడు. 

తాను ఎక్కడికి పారిపోలేదని, హైదరాబాద్‌లోనే ఉన్నానన్నారు. తన కొత్త సినిమాకి సంబంధించిన సాంగ్ లాంచింగ్ ఈవెంట్లో బీజీగా ఉన్నాయనని ఓ మీడియా ప్రతినిధికి ఆయన  చెప్పారు. అలాగే ట్విటర్‌(ఎక్స్‌) ద్వారా కూడా ఆయన ఈ కేసుపై స్పందించాడు.  అది నేను కాదు జెంటిల్మెన్, నేను ఇక్కడే ఉన్నాను ముందు క్లారిటీ తెచ్చుకోండి థాంక్స్ అని ట్వీట్‌ చేశాడు. 

నవదీప్‌ స్నేహితుడు అరెస్ట్‌
అయితే ఈ కేసులో నవదీప్‌ స్నేహితుడు రాంచందర్‌ని నార్కోటిక్ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయన ఇచ్చిన సమాచారం ప్రకారమే నవదీప్‌ను డ్రగ్స్‌  కన్స్యూమర్ గా తేల్చారు. ఈ విషయాన్ని సీసీ ఆనంద్‌ మీడియా ముఖంగా తెలియజేశారు. గతంలోనూ టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు విషయంలో నవదీప్‌ పేరు మారుమోగింది.అప్పట్లో ఎక్సైజ్, ఈడీ విచారణకు కూడా ఆయన హాజరయ్యారు. 

మరిన్ని వార్తలు