స్పై థ్రిల్లర్‌ మూవీలో నిఖిల్.. పోస్టర్ లుక్ అదుర్స్

30 Jan, 2023 15:59 IST|Sakshi

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఇటీవల 18 పేజెస్ మూవీతో మరో హిట్ అందుకున్నారు. బ్లాక్ బస్టర్ మూవీ కార్తికేయ-2 తర్వాత ఆయన నటించిన చిత్రం ఇదే.  ప్రస్తుతం 18 పేజెస్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న యంగ్ హీరో.. మరో మాస్‌ లుక్‌తో అభిమానులకు షాక్ ఇచ్చారు.   ప్రేక్షకులను మరోసారి థియేటర్లలో పలకరించేందుకు సిద్ధమయ్యారు. తాజాగా విడుదలైన నిఖిల్ లుక్ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది.  తాజాగా విడుదలైన పోస్టర్ సినిమాపై మరింత హైప్ పెంచుతోంది. ఈ విషయాన్ని హీరో సోషల్ మీడియాలో పంచుకున్నారు. 

పోస్టర్‌ను గమనిస్తే.. అందులో నిఖిల్ గన్‌ పట్టుకుని సీరియస్‌లో లుక్‌లో కనిపించారు.  నిఖిల్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'అఫీషియల్ లీక్.. కార్తికేయ-2 తర్వాత భారీ చిత్రంతో మీ ముందుకు వస్తున్నా. మల్టీ లాంగ్వేజ్ స్పై థ్రిల్లర్ ఈ వేసవిలో మీ ముందుకు రానుంది.' అంటూ పోస్ట్ చేశారు. నిఖిల్ లుక్ చూసిన ఫ్యాన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. అన్నా నీ సినిమా కోసం వెయిటింగ్ అని కొందరు.. మరికొందరేమో పోస్టర్ చూడగానే బ్లాక్ బస్టర్ అని కామెంట్స్ పెడుతున్నారు. 

A post shared by Nikhil Siddhartha (@actor_nikhil)

మరిన్ని వార్తలు