అనుపమ అల్లరిని బయటపెట్టిన నిఖిల్‌, షూటింగ్‌ టైంలో అలా..

8 Jun, 2021 10:04 IST|Sakshi

యంగ్ హీరో నిఖిల్‌, మ‌ళ‌యాలీ ముద్దుగుమ్మ అనుప‌మ పరమేశ్వరన్ జంట‌గా ‘కుమారి 21 ఎఫ్’ఫేమ్ ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్ ద‌ర్శ‌క‌త్వంలో ‘18 పేజెస్‌’ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ స‌మ‌ర్పణ‌లో జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. నిఖిల్‌ బర్త్‌డే సందర్భంగా జూన్‌ 1న విడుదల చేసిన ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ ఎంత ఫ్రెష్‌గా ఉందో అందరికి తెలిసిందే. నా పేరు నందిని అంటూ అనుపమ తన గురించి పరిచయం చేసుకోవడం, తన మనసులో ఉన్నది  నిఖిల్‌ మొహంపై పేపర్ పెట్టి రాసిన ఫస్ట్‌లుక్‌ అందరిని ఆకట్టుకుంది. 

తాజాగా ఈ ఫస్ట్‌లుక్‌ మేకింగ్‌ని బయటపెట్టాడు హీరో నిఖిల్‌. షూటింగ్‌ సమయంలో అనుపమ చేసిన అల్లరిని సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. యూనిట్‌ అంతా షూటింగ్‌ కోసం సీరియస్‌గా వర్క్‌ చేస్తుంటే.. అనుపమ మాత్రం సారంగదరియా పాటకు స్టెప్పులేస్తూ ఎంజాయ్‌ చేస్తుంది. ఈ వీడియోని నిఖిల్‌ ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ.. ‘నేను ఇంత వరకు చూసిన వారందరిలోనూ ఎంతో సంతోషంగా ఉండే వారిలో అనుపమ ది బెస్ట్‌’అంటూ క్యాప్షన్‌ ఇచ్చాడు. ఇక నిఖిల్‌ పోస్ట్‌పై అనుపమ స్పదించింది.మొత్తానికి ఆ విషయాన్ని నువ్ ఒప్పుకున్నావ్ అంటూ పగలబడి నవ్వుతున్న ఎమోజీలను షేర్ చేశారు. 

A post shared by Nikhil Siddhartha (@actor_nikhil)

చదవండి: 
‘ఆర్ఆర్‌ఆర్‌’ రిలీజ్‌ డేట్‌పై రాజమౌళి సంచలన నిర్ణయం!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు