Nithin : భార్యతో కలిసి సినిమా చూసిన నితిన్‌.. ఫోటోలు వైరల్‌

12 Aug, 2022 13:58 IST|Sakshi

హిట్లు ప్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు యంగ్‌ హీరో నితిన్. ఆయన తాజాగా నటించిన చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. నితిన్‌కి జోడీగా కృతీశెట్టి నటించింది. ఎంఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రాజ్‌కుమార్‌ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్‌ మూవీస్‌ బ్యానర్‌పై సుధాకర్‌ రెడ్డి, నికితారెడ్డి  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

నేడు(ఆగస్టు12)న ఈ చిత్రం విడుదలైంది. ఈ సందర్భంగా హీరో నితిన్‌ భార్య షాలినితో కలిసి హైదరాబాద్‌లోని సంధ్యా థియేటర్‌లో ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాను వీక్షించారు. వీరితో పాటు నిర్మాత శిరీష్‌ కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 

మరిన్ని వార్తలు