పెళ్లి సందడి షురూ

25 Jul, 2020 02:28 IST|Sakshi

హీరో నితిన్, షాలినీల పెళ్లి వేడుకలు షురూ అయ్యాయి. కరోనా కారణంగా వారి పెళ్లిని నిరాడంబరంగా చేయాలని ఇరు కుటుంబ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆదివారం రాత్రి 8:30 గంటలకు హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో  వివాహం జరగనుంది. ఈ వివాహానికి ఇరు కుటుంబ సభ్యులతో పాటు కొద్ది మంది అతిథులు మాత్రమే హాజరు కానున్నారు. కరోనా నేపథ్యంలో ఇటీవల నిశ్చితార్థం కూడా సింపుల్‌గా జరిపారు.

పెళ్లి వేడుకల్లో భాగంగా మెహందీ కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం నితిన్ ని పెళ్లి కొడుకుని చేశారు. ఈ వేడుకకు హీరో పవన్‌ కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్, హారికా అండ్‌ హాసినీ క్రియేష¯Œ ్స నిర్మాత చినబాబుతో పాటు పలువురు ప్రముఖులు  హాజరయ్యారు. ‘‘నన్ను పెళ్లి కొడుకును చేసిన సందర్భంగా ఆశీర్వదించడానికి పవర్‌స్టార్, త్రివిక్రమ్, చినబాబుగార్లు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇందుకు వారికి ధన్యవాదాలు’’ అన్నారు నితిన్‌.

ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వార్తలు