టీజర్‌.. ట్రైలర్‌ క్రేజీగా ఉన్నాయి

12 Sep, 2023 04:15 IST|Sakshi

– నితిన్‌ 

‘‘మార్క్‌ ఆంటోనీ’ సినిమా ఫస్ట్‌ లుక్, టీజర్, ట్రైలర్‌ క్రేజీగా ఉన్నాయి. ఈ చిత్రం కచ్చితంగా విజయం సాధిస్తుంది. ఈ చిత్రంతో విశాల్‌ మరో స్థాయికి వెళ్లాలి’’ అని హీరో నితిన్‌ అన్నారు. విశాల్, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘మార్క్‌ ఆంటోనీ’. అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో ఎస్‌. వినోద్‌ కుమార్‌ నిర్మించారు. ఎస్‌జే సూర్య, సునీల్, సెల్వరాఘవన్‌ కీలక ΄ాత్రల్లో నటించిన ఈ సినిమా ఈ నెల 15న రిలీజవుతోంది.

హైదరాబాద్‌లో నిర్వహించిన ‘మార్క్‌ ఆంటోనీ’ ప్రీ రిలీజ్‌ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు హీరో నితిన్‌. విశాల్‌ మాట్లాడుతూ–‘‘నా మొదటి చిత్రం ‘చెల్లమే’ (ప్రేమ చదరంగం) విడుదలై సెప్టెంబర్‌ 10కి 19 ఏళ్లు అవుతోంది. ప్రేక్షకులు టికెట్‌ కొని నా సినిమాలు చూస్తున్నారు. ఆ డబ్బుతో నేను, నా ఫ్యామిలీ మాత్రమే బాగుండాలనుకోను. ఆ డబ్బు అందరికీ ఉపయోగపడాలనుకుంటాను. ‘మార్క్‌ ఆంటోనీ’ని తెలుగులో వేణుగారు రిలీజ్‌ చేస్తున్నందుకు థ్యాంక్స్‌’’ అన్నారు. ‘‘ఇది తండ్రీ కొడుకుల కథ’’ అన్నారు అధిక్‌. ‘‘నా లైఫ్‌లో తమిళ సినిమా చేస్తాననుకోలేదు. నాకు రెండో అవకాశం ఇచ్చాడు అధిక్‌’’ అన్నారు నటుడు సునీల్‌.

మరిన్ని వార్తలు