త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌!

7 Jun, 2021 18:03 IST|Sakshi

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నట్లు తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. షార్ట్‌ ఫిలింలో నటించి.. దర్శకుల దృష్టిని ఆకర్షించిన అతడు ‘ఉయ్యాల జంపాల’ మూవీతో వెండితెరకు హీరోగా పరిచయమయ్యాడు. ఆ తరువాత ‘సినిమా చూపిస్తా మావ’ ‘కుమారి 21F’తో వరుస హిట్లు అందుకున్న ఈ కుర్ర హీరో అదే జోరును కొనసాగించలేకపోయాడు. క్రమంగా సినిమాలు తగ్గించి  ఖచ్చితంగా హిట్‌ కొట్టాలని భావించి ‘పవర్‌ ప్లే’, ‘ఓరేయ్‌ బుజ్జి’ సినిమాలు చేశాడు.

పవర్‌ ప్లే మూవీ పాజిటివ్‌ టాక్‌ వచ్చినప్పటికి ఆ సినిమా అనుకున్న విజయం సాధించలేకపోయింది. ఇక ఓటీటీలో విడుదలైన ఓరేయ్‌ బుజ్జి కూడా పెద్దగా గుర్తింపు పొందలేదు. ఇదిలా ఉండగా ఈ మధ్య యువ హీరోలంతా వరుసగా పెళ్లి పీటలెక్కి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఇక వారందరి బాటలో తాజాగా రాజ్‌ తరుణ్‌ కూడా అడుగులు వేసేందుకు సిద్ధమైనట్లు సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. కాగా ఇటీవల హైదరాబాద్‌లో సొంత ఇంటిని కొనుగొలు చేసిన రాజ్‌ తరుణ్, త్వరలో పెళ్లి చేసుకోని లైఫ్‌లో సెటిల్‌ అవ్వాలనుకుంటున్నాడని సన్నిహిత వర్గాల సమాచారం. దానికి తగ్గట్లు అతడు త్వరలోనే పెళ్లికి సిద్దమవుతున్నట్లు సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.

అయితే గతంలో రాజ్‌ తరుణ్‌ విజయవాడకు చెందిన ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నట్లు స్ఫష్టం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెతో ఈ కుర్ర హీరో ఏడడుగులు వేయనున్నాడేమోనని అందరు భావిస్తున్నారు. అయితే దీనిపై ఇంతవరకు ఎలాంటి స్పష్టత లేదు. ఇందులో ఎంతవరకు నిజమో తెలియాలంటే అతడు స్పందించే వరకు వేచి చూడాల్సింది. కాగా గతంలో కూడా రాజ్‌ తరుణ్‌ ఓ యాంకర్‌తో ప్రేమలో ఉన్నాడని, ఆమెను పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ వాటిని ఈ యంగ్‌ హీరో కొట్టిపారేశాడు. 

చదవండి: 
NTR 30: మ్యూజిక్‌ డైరెక్టర్‌గా అనిరుధ్‌!
సమంత గుడ్‌న్యూస్‌ చెప్పబోతోందా.. ఆ ఫోటోతో జోరుగా ప్రచారం!

మరిన్ని వార్తలు