నిల‌క‌డ‌గా హీరో రాజశేఖర్ ఆరోగ్యం

24 Oct, 2020 16:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ : కోవిడ్‌తో బాధపడుతూ ఇటీవల హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్‌లో చేరిన హీరో రాజశేఖర్ ఆరోగ్య ప‌రిస్థితి  ప్ర‌స్తుతం నిల‌క‌డ‌గా ఉందని ఆసుప‌త్రి వ‌ర్గాలు వెల్ల‌డించాయి. వైద్య చికిత్సకు ఆయన శరీరం స్పందిస్తోందని ప్ర‌క‌టిస్తూ  హెల్త్ బులెటిన్ విడుద‌ల చేశారు. ఆసుప‌త్రిలోనే ఇంకా చికిత్స కొన‌సాగుతుంద‌ని, నిపుణ‌లైన వైద్య బృందం నిరంతం ప‌ర్య‌వేక్షిస్తున్నట్లు తెలిపారు.  

హీరో రాజ‌శేఖ‌ర్ ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌ని పేర్కొంటూ ఆయ‌న కుమార్తె శివాని సైతం ట్వీట్ చేశారు. మీ అంద‌రి ప్రార్థ‌న‌లు, ఆశీస్తుల‌కు కృత‌ఙ్ఞ‌త‌లు అని తెలిపింది. మ‌రోవైపు రాజ‌శేఖ‌ర స‌తీమ‌ణి జీవిత‌కు క‌రోనా నెగిటివ్ రావ‌డంతో ఆమెను ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఇటీవ‌లె  నటుడు రాజశేఖర్, ఆయన కుటుంబ సభ్యులకు ఇటీవల కరోనా సోకిన సంగతి తెలిసిందే. (రాజశేఖర్‌‌ ఆరోగ్య పరిస్థితిపై చిరంజీవి ట్వీట్‌ )

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు