చిక్కుల్లో రామ్‌ డైరెక్టర్‌.. తమిళ నిర్మాత ఫిర్యాదు

27 Jun, 2021 18:20 IST|Sakshi

హైదరాబాద్‌: ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పోతినేని సినిమా చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. ఇటీవల రామ్ తమిళ దర్శకుడు లింగుస్వామితో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారో లేదో ఈ చిత్రాన్ని ఆపాలంటూ స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత జ్ఞాన్ వేల్ రాజా అడ్డుకుంటున్నారు. కాగా ఇదే తరహాలో సెన్సేషనల్‌ డైరెక్టర్‌ శంకర్, మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్ తో తెలుగులో సినిమా అనౌన్స్‌ చేయగానే లైకా ప్రొడక్షన్స్ అడ్డుకున్న సంగతి తెలిసిందే.

చిక్కుల్లో రామ్‌ చిత్రం
లింగుస్వామికి, త‌న‌కు మ‌ధ్య సినిమాల ప‌రంగా కొన్ని ఆర్థిక లావాదేవీలు పెండింగ్‌లో ఉన్నాయని, అవి తేలేవరకు మరో సినిమాలు చేయ‌కుండా చూడాల‌ని తెలుగు నిర్మాతల మండలిలో జ్ఞాన్‌వేల్‌ తెలుగు నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘మా బ్యానర్‌ లో లింగుస్వామి సినిమా చేయాల్సి ఉంది. కానీ ప్రస్తుతం అది పూర్తి చేయకుండా, మా ప్రాజెక్ట్ పక్కనపెట్టి తెలుగులో రామ్‌తో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. ఇది కరెక్టు కాదు, మాట ప్రకారం ముందు మా బ్యానర్‌లో సినిమా చేయాలి. ఆ తర్వాతే కొత్త ప్రాజెక్టులోకి వెళ్లాలి. అందుకే నేను ఫిర్యాదు చేశాను గానీ ఆయన రామ్‌తో సినిమా చేయడంపై మాకెలాంటి అభ్యంతరమూ లేదని’ వివరించారు.  మరి దీని పై లింగుస్వామి ఎలా స్పందిస్తారో చూడాలి.

చదవండి: ఫ్యాన్స్‌ కోసం ‘గుడ్‌ లక్‌ సఖి’ స్పెషల్‌ షో

మరిన్ని వార్తలు