కన్‌ ఫ్యూజన్‌ .. ఫన్‌

11 Feb, 2021 05:05 IST|Sakshi

‘‘కార్తీక్, ఉమ ప్రేమకథలో అనుకోకుండా చిట్టి అనే చిన్నపాప ప్రవేశిస్తే వచ్చే అపార్థాలు దేనికి దారి తీస్తాయి? ఆ పాప ఎవరు? మా ప్రేమకథని తను ఎలా గట్టెక్కించింది? అనే పాయింట్‌తో రూపొందిన చిత్రం ‘ఎఫ్‌సీయూకే. ఇందులో పాత్రల మధ్య ఉండే కన్‌ ఫ్యూజన్‌  మంచి వినోదం అందిస్తుంది’’ అన్నారు రామ్‌ కార్తీక్‌. జగపతిబాబు ప్రధాన పాత్రలో విద్యాసాగర్‌ రాజు దర్శకత్వం వహించిన చిత్రం ‘ఎఫ్‌సీయూకే (ఫాదర్‌–చిట్టి–ఉమా–కార్తీక్‌)’. కేఎల్‌ దామోదర్‌ ప్రసాద్‌ (దాము) నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ చిత్రంలో హీరోగా నటించిన రామ్‌ కార్తీక్‌ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ఇందులో నా పాత్ర  పక్కింటబ్బాయి తరహాలో ఉంటుంది. నటుడిగా నాలో నాకు తెలీని యాంగిల్‌ను ఈ సినిమాతో బయటకు తెచ్చారు విద్యాసాగర్‌గారు. ప్రివ్యూ చూసిన వారంతా నా నటనను మెచ్చుకోవడం సంతోషంగా ఉంది. ఈ సినిమాలో తండ్రీకొడుకుల మధ్య అనుబంధం ఫన్‌ గానే కాకుండా ఎమోషనల్‌గానూ ఉంటుంది. అది ఆడియన్స్‌కు బాగా రీచ్‌ అవుతుంది’’ అన్నారు. 

మరిన్ని వార్తలు