హనీమూన్‌ అక్కడే!

27 Aug, 2020 02:30 IST|Sakshi

హీరో రానా దగ్గుబాటి మిహికా బజాజ్‌తో ఏడడుగులు వేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 8న వీరి పెళ్లి హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో దగ్గుబాటి, మిహికా కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పెళ్లి వేడుక ముగించారు. రానా–మిహిక పెళ్లి వీడియో, ఫొటోలు బాగా వైరల్‌ అయ్యాయి కూడా. కోవిడ్‌ కారణంగా ఈ కొత్త జంట హనీమూన్‌ని కొన్నాళ్లు వాయిదా వేసుకుంది. ‘‘మా హనీమూన్‌ కోసం ఆమ్‌స్టర్‌డ్యామ్‌ని సెలక్ట్‌ చేసుకున్నాం. నాకు ఆర్ట్‌ అంటే ఇష్టం. ఆమ్‌స్టర్‌డ్యామ్‌ ఆర్టిస్టిక్‌గా ఉంటుంది. అందుకే ఆ ప్రదేశాన్ని ఎంచుకున్నా. మిహికా కూడా ఆ ప్లేస్‌కి ఓకే చెప్పిది. కరోనా వైరస్‌ ప్రభావం లేకపోతే ఇప్పుడే వెళ్లేవాళ్లం. సాధారణ పరిస్థితులు ఏర్పడిన వెంటనే మా హనీమూన్‌ ఉంటుంది’’ అని పేర్కొన్నారు రానా.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు