సత్యదేవ్‌ 25వ సినిమా..క్లాప్‌ కొట్టిన దిల్‌ రాజు

19 Aug, 2021 07:42 IST|Sakshi

‘బ్లఫ్‌ మాస్టర్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, తిమ్మరుసు’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన నటుడు సత్యదేవ్‌ 25వ చిత్రం షురూ అయింది. ఆయన హీరోగా ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో రూపొందుతున్న చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. వీవీ గోపాలకృష్ణ దర్శకత్వంలో అరుణాచల క్రియేషన్స్‌ బ్యానర్‌పై కృష్ణ కొమ్మలపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం తొలి సన్నివేశానికి దర్శకుడు హరీష్‌ శంకర్‌ కెమెరా స్విచాన్‌ చేసి, గౌరవ దర్శకత్వం వహించారు.

నిర్మాత ‘దిల్‌’ రాజు క్లాప్‌ కొట్టారు. కొరటాల శివ, ‘దిల్‌’రాజు, ఫైనాన్షియర్‌ ఎంఆర్‌వీఎస్‌ ప్రసాద్‌ స్క్రిప్ట్‌ను వీవీ గోపాలకృష్ణకు అందించారు. ‘‘సమర్పకుడిగా కొరటాల శివకు ఇది తొలి ప్రాజెక్ట్‌ కావడంతో ఈ సినిమాపై మరింత క్రేజ్‌ పెరిగింది. హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తాం’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: కాలభైరవ, కెమెరా: సన్నీ కూరపాటి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: రవి సుర్నిద్ది. 

చదవండి :అట్రాసిటీ కేసు: స్పందించిన దాసరి అరుణ్‌ కుమార్‌
రామ్‌ చరణ్‌కు గట్టి పోటీ ఇవ్వబోతోన్న ఫహద్‌ ఫాజిల్‌!

మరిన్ని వార్తలు