Sharwanand Marriage: త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్న హీరో శర్వానంద్‌? ప్రేమ వివాహమే!

5 Jan, 2023 10:12 IST|Sakshi

టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్లలో ఒకడైన హీరో శర్వనంద్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నట్లు తెలుస్తుంది. అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న ఎన్నారై అమ్మాయిని శర్వా పెళ్లి చేసుకోబోతోన్నట్లు ఫిల్మ్‌నగర్‌ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ఆమెది రెడ్డి సామాజిక వర్గమని, తెలంగాణకు చెందిన అమ్మాయి అని తెలుస్తుంది. గత కొన్నాళ్లుగా శర్వా ఆమెతో ప్రేమలో ఉన్నట్లు టాక్‌. త్వరలోనే ఈ ఇద్దరూ పెళ్లిపీటలెక్కనున్నారట.

దీనికి సంబంధించిన శర్వానంద్‌ స్వయంగా అనౌన్స్‌మెంట్‌ చేయనున్నట్లు సమాచారం. కాగా ఇటీవలె బాలయ్య అన్ స్టాపబుల్ షోలో శర్వానంద్ పెళ్లి ప్రస్థావన రాగా, ప్రభాస్‌ తర్వాతే పెళ్లి చేసుకుంటానని చెప్పిన శర్వా ఇప్పుడు బ్యాచిలర్‌ లైఫ్‌కు గుడ్‌బై చెప్పనుండటం విశేషం. 

మరిన్ని వార్తలు