బీజేపీ ఎంపీ తేజస్విపై సిద్దార్థ్‌ సంచలన వ్యాఖ్యలు

6 May, 2021 19:26 IST|Sakshi

హీరో సిద్దార్థ్‌, తమిళనాడు బీజేపీకి మధ్య ఉన్న వైరం రోజురోజుకు ముదురుతోంది. ఇటీవల తనను, తన కుటుంబ సభ్యులను చంపేస్తామంటూ సందేశాలు వస్తున్నాయని, అంతేగాక అత్యాచారం బెదిరింపులు కూడా వస్తున్నాయని చెబుతూ, రాష్ట్ర బీజేపీ ఐటీ సెల్‌ తన పర్సనల్‌ ఫోన్‌ నంబర్‌ లీక్‌ చేయడం వల్లే ఇలా జరిగిందని సోషల్‌ మీడియా వేదికగా ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే దీనిని బీజేపీ ఖండించింది. ఈ వివాదం ఇలా ఉండగానే సిద్దార్థ్‌ మరో వివాదానికి తెరలేపాడు.

తాజాగా బీజేపీ యువ పార్ల‌మెంట్ స‌భ్యుడు తేజ‌స్వి సూర్య‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. బెంగ‌ళూరులోని ప‌లు ఆస్ప‌త్రుల్లో చాలా బెడ్స్ అందుబాటులో ఉన్నప్ప‌టికీ..వాటిని బ్లాక్ చేశాడ‌ని తేజ‌స్వి సూర్య‌పై ఇప్ప‌టికే ఆరోప‌ణ‌లు వ‌చ్చిన సంగతి తెలిసిందే. ఇవాళ దీనిపై సిద్దార్థ్‌ ట్వీట్‌ చేస్తూ.. ‘యంగ్ ఎంపీ తేజ‌స్వి సూర్య చాలా ప్ర‌మాద‌క‌ర‌మైన వ్య‌క్తి. టెర్ర‌రిస్ట్ అజ్మ‌ల్ క‌స‌బ్ కంటే ద‌శాబ్ద‌కాల‌పు ముందు వ్య‌క్తి. ఈ ట్వీట్‌ను సేవ్ చేయండి’ అంటూ రాసుకొచ్చాడు. సిద్దార్థ్ ట్వీట్ పై బీజేపీ స్పందిస్తూ.. 2రాజ‌కీయ భావ‌జాలం భిన్నంగా ఉండొచ్చు. కానీ సిద్దార్థ్ వ్యాఖ్య‌లు స‌మ‌ర్థ‌నీయ‌మైన‌వి కావు. సిద్దార్థ్ త‌న దూకుడును త‌గ్గించుకోవాలి’  అని హెచ్చరించింది. 

చదవండి: 
హీరో సిద్దార్థ్‌కు బెదిరింపులు.. ఖండించిన బీజేపీ

నాపై అత్యాచారం చేస్తామని బెదిరిస్తున్నారు: హీరో సిద్ధార్థ్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు