Siddharth: 'అప్పుడు యాక్టింగ్‌ మానేసి వేరే ఉ‍ద్యోగం చూసుకుంటా'

14 May, 2022 08:26 IST|Sakshi

లవర్‌ బాయ్‌ ఇమేజ్‌తో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న హీరో సిద్దార్థ్‌. చాలాకాలం తర్వాత మ‌హాస‌ముద్రం సినిమాతో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద అనుకున్నంత విజయం సాధించలేదు. తాజాగా ఎస్కేప్‌ లైవ్‌ అనే హిందీవెబ్‌సిరీస్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా వ‌స్తున్న ఈ సిరీస్‌ డిస్నీ+హాట్ స్టార్ (Disney + Hotstar)లో మే 20 నుంచి ప్రీమియ‌ర్ కానుంది.

ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో భాగంగా  ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్దార్థ్‌ పలు ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశాడు. 'ఈ సిరీస్‌లో నాది రెగ్యులర్‌ రోల్‌ కాదు. ఈ పాత్రలో నన్ను ఎంపిక చేసినందుకు సంతోషంగా ఉంది. మంచి ఆఫర్లు వస్తే మళ్లీ బాలీవుడ్‌కు తిరిగొస్తా. ఢిపరెంట్‌ రోల్స్‌ వచ్చే వరకు యాక్టింగ్‌ చేస్తా. లేదంటే వేరే ఉద్యోగం చూసుకుంటా' అని సిద్దార్థ్‌ పేర్కొన్నాడు. 

మరిన్ని వార్తలు