ఆరు నిమిషాల సీన్‌ సింగిల్‌ టేక్‌

26 Apr, 2021 07:22 IST|Sakshi

ఆరు నిమిషాల సన్నివేశాన్ని సింగిల్‌ టేక్‌లో నటించి ప్రశంసలు అందుకున్నారు నటుడు శింబు. ఈయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం మనాడు. వి హౌస్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై సురేష్‌ కామాక్షి నిర్మిస్తున్న ఈ చిత్రానికి వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో నటి కళ్యాణి ప్రియదర్శన్‌ కథానాయికగా నటిస్తున్నారు. ప్రధాన పాత్రలో ఎస్‌ జే. సూర్య నటిస్తున్న ఇందులో వైజీ.మహేంద్రన్, వాగై చంద్రశేఖర్, ఎస్‌ఏ చంద్రశేఖర్, ఆంజనా కీర్తి, ఉదయ, మనోజ్‌ కె భారతి, కరుణాకరణ్, మహత్, డేనియల్‌ పోప్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ ప్రస్తుతం చెన్నై చుట్టుపక్కల ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. కాగా శనివారం నటుడు శింబు, కళ్యాణి ప్రియదర్శన్, ఎస్‌ జె సూర్య, ప్రేమ్‌ జీ పాల్గొన్న సన్నివేశాలను దర్శకుడు వెంకట్‌ ప్రభు చిత్రీకరించారు. అందులో భాగంగా ఆరు నిమిషాల సన్నివేశాన్ని నటుడు శింబు సింగిల్‌  టేక్‌ లో నటించి సింగల్‌ టేక్‌  నటుడు అన్న విషయాన్ని మరోసారి రుజువు చేశారు. ఆ సన్నివేశం పూర్తి కాగానే చిత్ర యూనిట్‌  అంతా చప్పట్లు కొట్టి ఆయన్ని ప్రశ్నించినట్లు నిర్మాత తెలిపారు.
చదవండి: ఒకే బాటలో నయనతార.. త్రిష!

మరిన్ని వార్తలు