అప్పటి నుంచి ఆల్కహాల్‌ మానేశా : హీరో శింబు

24 Jun, 2021 20:17 IST|Sakshi

మధ్యపానం ఆరోగ్యానికి హానికారం అని తెలిసినా చాలామంది ఆ వ్యసనానికి అలవాటుపడతారు. దీనికి హీరో, హీరోయిన్లు కూడా అతీతం కాదు. డిప్రెషన్‌తో మద్యం, డ్రగ్స్‌కు అలవాటు పడి కెరీర్‌ని నాశనం చేసుకున్నవారు ఎందరో ఉన్నారు. అలాగే... మత్తుతో తమ జీవితం చిత్తవుతుందని గ్రహించి త్వరగా ఆ వ్యసనం నుంచి బయటపడి కెరీర్‌ను గాడిన పెట్టుకున్న నటీనటులూ ఉన్నారు. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి కోలీవుడ్‌ హీరో శింబు కూడా చేరిపోయారు. ప్రస్తుతం శింబు ‘మానాడు’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. యాక‌్షన్‌ కథాంశంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది.

తాజాగా ఈ మూవీలోని ఓ పాటను ట్విట్టర్‌ వేదికగా చిత్రబృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా శింబు, డైరెక్టర్‌ వెంకట్‌ ప్రభు, హీరోయిన్‌ కల్యాణి ప్రియదర్శి సహా పలువురు నటీనటులు ఈ లైవ్‌ సెషన్‌లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో నటుడు ఎస్‌జే సూర్య అడిగిన ఓ ప్రశ్నకు స‌మాధానంగా తాను ఆల్కహాల్‌ మానేసినట్లు శింబు వెల్లడించాడు. ఆల్కహాల్‌ మానేసి దాదాపు ఏడాది కావొస్తుందని,మందు మానేయడం వల్ల తాను చాలా ఆరోగ్యంగా, యాక్టివ్‌గా ఉన్నట్లు తెలిపాడు. ఇప్పుడు తన ఫోకస్‌ అంతా హెల్త్‌ అండ్‌ ఫిట్‌నెస్‌పైనే ఉందని వివరించాడు. 

చదవండి : అభిమానులకు థ్యాంక్స్‌ చెప్పిన కోలీవుడ్‌ స్టార్‌ శింబు
తమిళనాడు రియల్‌ పాలిటిక్స్‌ ఆధారంగా ధనుష్‌ మూవీ!

మరిన్ని వార్తలు