Telangana Devudu: వెండితెరపై సీఎం కేసీఆర్‌ బయోపిక్‌.. తెలంగాణ దేవుడుగా శ్రీకాంత్‌

24 Oct, 2021 08:11 IST|Sakshi

‘‘తెలంగాణ దేవుడు’ చిత్రంలో చరిత్ర సృష్టించిన వ్యక్తి పాత్ర చేయడం గర్వంగా ఉంది. ఈ చిత్రం అందరికీ నచ్చే విధంగా ఉంటుంది’’ అని శ్రీకాంత్‌ అన్నారు. శ్రీకాంత్‌ లీడ్‌ రోల్‌లో, జిషాన్‌ ఉస్మాన్‌ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘తెలంగాణ దేవుడు’. హరీష్‌ వడత్యా దర్శకత్వంలో మొహ్మద్‌ జాకీర్‌ ఉస్మాన్‌ నిర్మించిన ఈ చిత్రం  నవంబర్‌ 12న విడుదల కానుంది.

ఈ సందర్భంగా హరీష్‌ వడత్యా మాట్లాడుతూ– ‘‘తెలంగాణ దేవుడు’ వంటి గొప్ప చిత్రాన్ని డైరెక్ట్‌ చేసే అవకాశం ఇచ్చిన జాకీర్‌ ఉస్మాన్‌కి థ్యాంక్స్‌’’ అన్నారు. ‘‘సీయం కేసీఆర్‌గారి బయోపిక్‌గా మా చిత్రం రూపొందింది. తెలంగాణ ఆవిర్భావానికి ముందు ఏం జరిగిందనే అంశాలను చూపించాం’’ అన్నారు మొహ్మద్‌ జాకీర్‌ ఉస్మాన్‌. జిషాన్‌ ఉస్మాన్, మ్యాక్‌ ల్యాబ్‌ సీఈఓ మొహ్మద్‌ ఇంతెహాజ్‌ అహ్మద్, లైన్‌ ప్రొడ్యూసర్‌ మహ్మద్‌ ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు