Sudheer Babu : సుధీర్‌బాబు నెక్ట్స్‌ సినిమా.. ఇంట్రెస్టింగ్‌గా పోస్టర్‌

12 Feb, 2022 13:20 IST|Sakshi

Hero Sudheer Babu Announces His Next Movie: హీరో సుధీర్‌బాబు ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ఇటీవలె శ్రీదేవి సోడా సెంటర్‌ సినిమాతో హిట్‌ అందుకున్న సుధీర్‌బాబు ప్రస్తుతం కృతిశెట్టితో కలసి 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమాలో నటిస్తున్నారు. దీంతో పాటు  హర్షవర్ధన్‌ దర్శకత్వంలో ఓ సినిమాకు సైన్‌ చేశాడు. తాజాగా తన 16వ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ని అభిమానులతో పంచుకున్నాడు.

మహేష్ సురపనేని దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దీనికి  ‘గన్స్ డోంట్ లై’ అనే ట్యాగ్‌లైన్‌తో పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. చుట్టూ తుపాకులు, పోలీస్ స్పెషల్ క్రైమ్స్ డివిజన్ అనే లోగోతో ఇంట్రెస్టింగ్‌గా పోస్టర్‌ను వదిలారు. ఈ సినిమాలో హీరోయిన్‌ సహా మరింత సమాచారం త్వరలోనే తెలియనుంది. 

మరిన్ని వార్తలు