నెట్టింట వైరలవుతున్న సుధీర్‌బాబు ఫ్యామిలీ ఫోటోలు

21 May, 2021 16:33 IST|Sakshi

గతేడాది 'వి' చిత్రంతో అలరించిన యంగ్‌ హీరో సుధీర్‌బాబు ప్రస్తుతం రెండు చిత్రాలతో బిజీగా ఉన్నారు. సినిమా షూటింగులతో బిజీగా ఉండే సుధీర్‌బాబు ఏ మాత్రం సమయం దొరికినా కుటుంబంతో గడపడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. తాజాగా తన ఫ్యామిలీ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి. అందరూ ట్రెడిషనల్‌ అవుట్‌ఫిట్‌లో కనిపించారు. సుధీర్‌బాబు భార్య పద్మిణి ప్రియదర్శిని సూపర్‌స్టార్‌ కృష్ణ కూతురన్న సంగతి చాలా మందికి తెలియదు. 2006లో వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. వీరికి చ‌రిత్ మానస్ – దర్శన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో చ‌రిత్ మాన‌స్ ఇప్ప‌టికే చైల్డ్ ఆర్టిస్ట్‌గా వెండితెర ఆరంగేట్రం చేశారు.

ప్రస్తుతం సుధీర్‌బాబు చేతిలో రెండు సినిమాలున్నాయి. ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలో ఓ  చిత్రం చేస్తున్నారు.  ‘సమ్మోహనం, ‘వి’ చిత్రాల తర్వాత హీరో సుధీర్‌ బాబు, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో రూపొందతున్న మూడో చిత్రమిది. ఈ మూవీలో ఉప్పెనలో బేబమ్మగా అలరించిన కృతిశెట్టి సుధీర్‌బాబుకు జంటగా నటించనుంది.

ఈ మూవీతో పాటు 'పలాస 1978’ ఫేమ్‌ కరుణ కుమార్‌ దర్శకత్వంలో సుధీర్‌బాబు నటిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌ గ్లింప్స్‌ ఇటీవలె రిలీజ్‌ చేశారు. ఈ చిత్రంలో సుధీర్‌బాబు సూరిబాబుగా నటిస్తున్నారు. ఫస్ట్‌ గ్లింప్స్‌లో సిక్స్‌ ప్యాక్‌ బాడీతో కనిపించి మరోసారి ఫిట్‌నెస్‌పై తనకున్న డెడికకేషన్‌ను నిరూపించుకున్నారు. ఇక గతంలోనూ సుధీర్‌బాబు బావ, సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు కూడా సుధీర్‌బాబు ఫిట్‌నెస్‌పై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. 

చదవండి : 'సిక్స్‌ ప్యాక్‌ బాడీ సీక్రెట్స్‌ చెప్పమని ఆ హీరోలు అడుగుతారు'
ఐదెకరాల పొలంతో పాటు ఓ స్కూటర్‌ ఉంది..నన్ను పెళ్లిచేసుకుంటావా?

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు