హీరోగా సుమన్‌ కొత్త చిత్రం ప్రారంభం

8 Oct, 2022 14:27 IST|Sakshi

సుమన్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘మహరాజు’. శ్రీ వెంకట లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్‌పై వెంకట నరసింహ రాజ్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని నిర్మించడంతో పాటు కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం కూడా వహిస్తున్నారు వెంకట నరసింహ రాజ్‌. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంకట నరసింహ రాజ్‌ మాట్లాడుతూ– ‘‘ఇంతకుముందు ‘అల్లుడు బంగారం’, ‘అంతేనా.. ఇంకేం కావాలి’ వంటి చిత్రాలు నిర్మించాం.

సుమన్‌ గారితో ఒక వైవిధ్యమైన కథతో మూడో చిత్రాన్ని రూపొందించనున్నాం. వచ్చే నెల రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం. ప్రముఖ నటీనటులతో పాటు నూతన నటీనటులు కూడా ఈ సినిమాలో నటిస్తారు’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీ వెంకట్, కెమెరా: పీఆర్‌ చందర్‌ రావు, సహనిర్మాత: సి. ఈశ్వర్‌ రెడ్డి.

మరిన్ని వార్తలు