'విరించి' సినిమా..యూట్యూబ్‌లో విడుదల‌

19 Mar, 2021 16:57 IST|Sakshi

కదిలే బొమ్మలు ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై స్కంద మిత్ర హీరోగా సత్య కె దర్శకత్వంలో తెరకెక్కిన ఇండిపెండెంట్ ఫిలిం 'విరించి'. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ తో చిత్రంపై పాజిటివ్‌ హైప్‌ క్రియేట్‌ అయ్యింది. ఇటీవలె చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. శుక్రవారం విరించి ట్రైలర్‌ను హీరో సుమంత్‌ రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..'ట్రైలర్‌ చూశాను..చాలా బాగుంది. డైరెక్టర్‌ పనితనం ట్రైలర్‌లో కనిపించింది. హీరో స్కంద మిత్ర అద్భుతంగా నటించాడు.

మంచి సినిమాను ఆదరించి విజయవంతం చేయాలి. షేడ్ స్టూడియోస్‌లో అనే యూట్యూబ్‌ ఛానెల్‌లో విడుదలవుతున్న ఈ సినిమాను చూసి ఎంజాయ్‌ చేయండి' అని సుమంత్‌ అన్నారు. బాజీ కీస్ సంగీతం అందించిన ఈ చిత్రానికి అరవింద్ సుదర్శన్ ఫోటోగ్రాఫర్‌గా పనిచేశారు. స్కంధ మిత్ర, ప్రీతి నిగమ్, రవి వర్మ, షఫీ, వేదం నాగయ్య, హరి ప్రియ, అప్పాజీ అంబరీష  దర్భా, అల్లా మహమ్మద్ ఓతుర్ ముఖ్య పాత్రల్లో నటించారు. 

చదవండి : నాన్న.. నాకు అన్నీ మీరే: మంచు లక్ష్మీ
(మహేశ్‌బాబు లగ్జరీ కారవాన్‌‌‌: ఖరీదు ఎంతో తెలుసా?)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు